Bigg Boss Sohel : బిగ్‌బాస్ సోహెల్‌తో ‘వకీల్‌సాబ్’ భామ

బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సోహెల్ తాజాగా మరో సినిమా కూడా ఓకే చేసి షూటింగ్.......

Bigg Boss Sohel : బిగ్‌బాస్ సోహెల్‌తో ‘వకీల్‌సాబ్’ భామ

Sohel

Bigg Boss Sohel :  గత సీజన్ బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సోహెల్ తాజాగా మరో సినిమా కూడా ఓకే చేసి షూటింగ్ మొదలు పెట్టాడు. ఇక వకీల్ సాబ్ లో నటించిన అనన్య నాగళ్ళ ఆ సినిమా తర్వాత మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది అనన్య. ఇక తన అందమైన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో అభిమానులని ఆకట్టుకుంటుంది.

Ashu Reddy : ప్రగ్నెంట్ అయిన అషూరెడ్డి.. పిచ్చ కొట్టుడు కొట్టిన అషూ తల్లి..

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా ‘బూట్‌కట్‌ బాలరాజు’ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా నిన్న పూజ కార్యక్రమంతో ప్రారంభించారు. శ్రీ కోనేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌ కొట్టగా మరో నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి దీనికి గౌరవ దర్శకత్వం వహించారు.

Bigg Boss : మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్.. పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్ బ్యూటీ

ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అంగీకరించిన రెండో సినిమా ఇది. నా పాత్ర మీ అందరికి చాలా కాలం గుర్తుండిపోతుంది అని సోహెల్‌ అన్నారు. ఈ సినిమాలో కూడా అనన్య మరోసారి తెలంగాణ యువతిగా నటించబోతుంది. ఇది పూర్తి కామెడీ చిత్రమని, ఫిబ్రవరి లోపు షూటింగ్ ని పూర్తి చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.