Anasuya Bharadwaj : బరువు పెరిగిన స్టార్ యాంకర్.. ‘పుష్ప’ కోసమేనా..

‘పుష్ప’ సినిమాలో క్యారెక్టర్ కోసం స్టార్ యాంకర్ బరువు పెరిగింది..

Anasuya Bharadwaj : బరువు పెరిగిన స్టార్ యాంకర్.. ‘పుష్ప’ కోసమేనా..

Anasuya

Anasuya Bharadwaj: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ గురించి ఎలాంటి కామెంట్స్ వచ్చాయో, కామెంట్ చేసిన వాళ్లకి ఆమె ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలిసిందే. ఇప్పుడు అనసూయ ఫిజిక్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆమె కాస్త లావుగా కనిపించడంతో.. ఏడాది క్రితం పిక్, ఇప్పటి ఫొటో పక్కపక్కన పెట్టి అనసూయ లావైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా లావుగా కనిపించింది. తర్వాత సన్నగా అయ్యింది. మళ్లీ ఇప్పుడు లావెక్కింది అంటున్నారు నెటిజన్లు.

Anasuya

 

అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా సత్తా చాటుతోంది.. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, ‘‘థ్యాంక్ యు బ్రదర్!’ సినిమాల్లో ఆమె చేసిన క్యారెక్టర్లు మంచి పేరు తెచ్చి పెట్టాయి.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ అటునుండి మాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది అనసూయ. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు అనసూయను ఫిక్స్ చేశారు.

Anasuya : బన్నీపై అనసూయ కామెంట్స్..!

కార్తికేయ హీరోగా నటించిన ‘చావు కబురు చల్లగా’ ‘పైన పటారం’ అనే స్పెషల్ సాంగ్‌లో రచ్చ చేసింది. అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో సునీల్ భార్యగా, కంప్లీట్ నెగెటివ్ రోల్ చేస్తుంది అనసూయ. హెయిర్ కట్ చేసుకుని, శారీలో కనిపిస్తున్న అనసూయ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప’ లో ఆమె గెటప్ ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి.

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..