Chiranjeevi : బ్యాక్ టు బ్యాక్ మెగాస్టార్ సినిమాల్లో అనసూయ

తాజాగా అనసూయ సినిమాల గురించి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది అనసూయ. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుంది...

Chiranjeevi :  బ్యాక్ టు బ్యాక్ మెగాస్టార్ సినిమాల్లో అనసూయ

Anasuya

Anasuya :  బుల్లితెర స్టార్ యాంకర్​ అనసూయ యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీ అయింది. ఒకపక్క జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తూనే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తుంది అనసూయ. ఇటీవలే ‘పుష్ప’లో దాక్షాయణిగా, ‘ఖిలాడీ’ సినిమాలో రవితేజ అత్తగా నటించి అలరించింది. సినిమాల్లో ఎలాంటి పాత్ర వేయడానికి అయినా అనసూయ రెడీగా ఉంది. ఒకపక్క గ్లామరస్ పాత్రలు వేస్తూనే మరో పక్క నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు వేస్తూ మలయాళంలో కూడా ఏకంగా మమ్ముట్టి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

తాజాగా అనసూయ సినిమాల గురించి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది అనసూయ. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ‘ఆచార్య’ సినిమా రిలీజ్ అవ్వనుంది. తాజాగా అనసూయ మెగాస్టార్ తో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో అనసూయ ఓ డిఫరెంట్ రోల్ చేయబోతుందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే అనసూయ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అవ్వనుంది.

RGV : ఇంత అందంతో నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు.. యాంకర్ శ్యామల పై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

మొత్తానికి మెగాస్టార్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక పక్క బుల్లితెర పై స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఇలా భారీ సినిమాల్లో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలు కొట్టేస్తూ సినిమాల్లో కూడా తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది అనసూయ.