Anchor Ravi: ఆ రూ.45 లక్షలు.. మోసపోయిన రవికి అదే బాధ!

ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వస్తే ఆ సెలబ్రిటీకి మరింత పాపులారిటీ వస్తుందని ఓ నమ్మకం. ఆ నమ్మకం సంగతెలాఉన్నా ఇంట్లో నుండి బయటకి వచ్చాక వాళ్ళు ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా..

Anchor Ravi: ఆ రూ.45 లక్షలు.. మోసపోయిన రవికి అదే బాధ!

Anchor Ravi

Anchor Ravi: ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వస్తే ఆ సెలబ్రిటీకి మరింత పాపులారిటీ వస్తుందని ఓ నమ్మకం. ఆ నమ్మకం సంగతెలాఉన్నా ఇంట్లో నుండి బయటకి వచ్చాక వాళ్ళు ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంటారన్నది మాత్రం నిజం. అలాంటిది యాంకర్ గా స్మాల్ స్క్రీన్ మీద ఫుల్ స్వింగ్ లో ఉన్న రవి లాంటి వాళ్లకి బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక ఇంటర్వ్యూలతో ఇంకా ఫుల్ డిమాండ్ ఉంటుంది. బిగ్ బాస్ ఇంట్లో విషయాలతో పాటు రవి పర్సనల్ విషయాలను కూడా ఈ ఇంటర్వ్యూలలో మరోసారి గుర్తు చేసుకుంటున్నాడు.

Tollywood New Releases: అఖండ ఊపు.. ఇక బాక్సాఫీస్‌పై టాలీవుడ్ యుద్ధమే!

యాంకర్ రవి గతంలో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన సంగతి చాలా సార్లు చెప్పాడు. తాను యాంకర్ గా కస్టపడి పైసా పైసా కూడబెట్టిన డబ్బు ఏకంగా రూ.45 లక్షలు మోసపోవడంతో ఇప్పటికీ దాన్ని నుండి కోలుకోలేకపోతున్నాడు. ఆ విషయాన్ని సులభంగా మర్చిపోలేకపోతున్నాడు. తన వద్ద చాలాకాలంగా పనిచేసిన ఓ వ్యక్తి ఉన్నట్లుండి ఒకరోజు తన వద్దకి వచ్చి అన్నా బిజినెస్‌ పెట్టాలి.. మా పరిస్థితి అంత బాగోలేదు అంటూ సాయం చేయమని అడిగాడు. రెండు సంవత్సరాల పాటు తనతో ఉన్న నమ్మకంతో రవి అతన్ని నమ్మాడు.

Bigg Boss 5: బిగ్ బాస్ తర్వాత ఇంట్లో వినిపించే గొంతు కాజల్‌దే

పైగా అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం.. రోజూ గుడికి వెళ్లడం.. గౌరవం, వినయం చూసిన రవి అతన్ని గుడ్డిగా నమ్మి ఎలాంటి పత్రం లేకుండా రూ.45 లక్షలు ఇచ్చాడు. నెల రోజుల్లో ఇచ్చేస్తానన్న అతను ఇప్పటికీ రవి మొహం చూడడం లేదు. గతంలో ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పిన రవి తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నాడు. చాలా పెద్ద మొత్తం కావడంతో తన భార్య ఇప్పటికీ ఉపవాసాలు, పూజలు చేస్తుందని.. ఆ డబ్బు తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుకుంటుందని చెప్పుకొచ్చాడు రవి.