Vishnu Priya : హీరోయిన్ అవ్వకుండానే చనిపోతా అనుకున్నా.. కానీ రాఘవేంద్రరావు గారి వల్ల..

  టాలీవుడ్ అందాల యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి, యాంకర్ గా పలు టీవీ షోలు చేసి ప్రస్తుతం................

Vishnu Priya : హీరోయిన్ అవ్వకుండానే చనిపోతా అనుకున్నా.. కానీ రాఘవేంద్రరావు గారి వల్ల..

Vishnu Priya

Vishnu Priya :  టాలీవుడ్ అందాల యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి, యాంకర్ గా పలు టీవీ షోలు చేసి ప్రస్తుతం టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. హీరోయిన్ అవ్వాలని, సినిమాల్లో ఎదగాలని చాలా ట్రై చేస్తుంది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోస్, తన బెల్లీ డ్యాన్సులు షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా యాంకర్ దీపికా పిల్లి, విష్ణుప్రియలు హీరోయిన్స్ గా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకుడు. తాజాగా జరిగిన ఈ చిత్ర మీడియా సమావేశంలో విష్ణు ప్రియ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Krithi shetty : లైవ్ లో ఏడ్చేసిన కృతిశెట్టి.. ప్రాంక్ చేసి ఏడిపించిన వారిపై నెటిజన్ల ఆగ్రహం..

ఈ మీడియా సమావేశం లో విష్ణుప్రియ మాట్లాడుతూ.. ”నేను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ రాఘవేంద్రరావు గారు పండుగాడ్ చిత్రంలో నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన వల్ల నేను హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం రాఘవేంద్రరావుతో ఫోటో దిగి మై బెస్ట్ ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది విష్ణు. మరి ఈ సినిమాలో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.