NTR 30 : పనిలో పిల్లోడు కాదు.. అందుకే అంత ఇస్తున్నారంట..

ఇప్పటికే సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని ఫిక్స్ చెయ్యడం, అతను వర్క్ స్టార్ట్ చెయ్యడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.. ఈ సినిమాకి గాను అనిరుధ్‌కి కళ్లు చెదిరే పారితోషికం ఇస్తున్నారట..

NTR 30 : పనిలో పిల్లోడు కాదు.. అందుకే అంత ఇస్తున్నారంట..

Ntr 30

NTR 30: ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఉక్రెయిన్‌లో సాంగ్స్ కంప్లీట్ కాగానే యంగ్ టైగర్ ఫ్రీ అయిపోతాడు. కాస్త బ్రేక్ తర్వాత కొరటాల సినిమాకు షిఫ్ట్ అవుతాడు. తారక్, కొరటాల శివ కలయికలో, కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో ఎన్టీఆర్ 30వ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..

ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరినుండి.. హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి నెట్టింట బోలెడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘అరవింద సమేత’ ఛాన్స్ మిస్ అయిన కొలవెరి కుర్రాడు అనిరుధ్ ఈ సినిమాతో తారక్‌తో వర్క్ చేసే అవకాశం అందుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని ఫిక్స్ చెయ్యడం, అతను వర్క్ స్టార్ట్ చెయ్యడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.

Pushpa : డీఎస్పీ మరో చార్ట్ బస్టర్.. ‘దాక్కో దాక్కో దాక్కో మేక’..

ఈ సినిమాకి గాను అనిరుధ్‌కి కళ్లు చెదిరే పారితోషికం ఇస్తున్నారట. ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయలు రెమ్యునరేష‌న్‌గా ఇస్తున్నట్లు సమాచారం. అనిరుధ్ మ్యూజిక్‌కి ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి మేకర్స్ సిద్ధపడ్డారని ఫిలింనగర్ టాక్. ఈ ఏడాది చివరికల్లా సినిమా పట్టాలెక్కబోతోంది.

NTR 30