‘Ms. Shetty Mr. Polishetty’: అనుష్క శెట్టితో నవీన్ పోలిశెట్టి

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ఇటీవలికాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.

‘Ms. Shetty Mr. Polishetty’: అనుష్క శెట్టితో నవీన్ పోలిశెట్టి

Naveen

Anushka Shetty and Naveen Polishetty film: తెలుగులో స్టార్ హీరోయిన్‌గా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ఇటీవలికాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. గతేడాది మాత్రం నిశ్మబ్ధం అనే సినిమాతో అమెజాన్‌లో దర్శనం ఇచ్చినా అంతగా పట్టించుకోలేదు.. ఓ బాహుబలి, ఓ అరుందతి వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఓ సినిమాను పట్టాలెక్కించబోతుంది అనుష్క. సరికొత్త కథాంశంతో ఇప్పటివరకు తెలుగు తెరపై టచ్ చెయ్యని సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తియ్యబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో సత్తా చాటి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్నాడు.

ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ”మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. రోమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కబోతున్న ఈసినిమా షూటింగ్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది.