Apple iPhone 13 Series : ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే?

రాబోయే ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడల్స్ iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 13 mini మోడళ్లలో లభించనుంది. అన్ని ఐఫోన్ 13 మోడల్స్ Light Detection and Ranging (LiDAR) స్కానింగ్ టెక్నాలతో రానున్నాయి.

Apple iPhone 13 Series : ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే?

Apple Iphone 13 Series May Launch In September

Apple iPhone 13 Series : ఎప్పుడినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ వచ్చే సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లోకి రాబోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 ఉంటుందని అంచనా. Wedbush Securities విశ్లేషకులు Daniel Ives ప్రకారం.. iPhone 13 Series మోడల్ ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఐఫోన్ 13 సిరీస్ మోడల్‌లో ఆపిల్ 1TB స్టోరేజీ ఆప్షన్ అందించనుంది. ప్రస్తుతం 512GB వరకు మాత్రమే స్టోరేజీ అందిస్తోంది.

రాబోయే ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడల్స్ iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 13 mini మోడళ్లలో లభించనుంది. అన్ని ఐఫోన్ 13 మోడల్స్ Light Detection and Ranging (LiDAR) స్కానింగ్ టెక్నాలతో రానున్నాయి. ఈ టెక్నాలజీ ఇప్పటివరకూ iPhone 12, iPhone 12 Pro Max మాత్రమే అందుబాటులో ఉంది. LiDAR సెన్సార్లు iPhone 13 సిరీస్ లో Pro మోడల్స్ లో మాత్రమే లిమిటెడ్ గా అందించనున్నట్టు మార్కెట్ రీసెర్చ్ సంస్థ TrendForce తెలిపింది. ఆపిల్ తమ ప్రొడక్టుల్లో iPhone 13 సిరీస్ ఉత్పత్తి 90 మిలియన్ల యూనిట్ల నుంచి 100 మిలియన్లకు తాకే అవకాశం ఉంది. ఐఫోన్ 12 సిరీస్ 80 మిలియన్ల యూనిట్ ప్రొడక్షన్ మాత్రమే తాకింది.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
– 6GB RAM, 64GB, 6GB RAM +128GB
– 6GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ
– బ్లాక్, పెరల్, సన్ సెట్ గోల్డ్
– iOS v14 ఆపరేటింగ్ సిస్టమ్, 3850mAh బ్యాటరీ
– Hexa Core (3.1 GHz, Dual Core
– Firestorm + 1.8 GHz, Quad Core, Icestorm) ప్రాసెసర్
– సింగిల్ రియర్ కెమెరా, డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, షేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ కెమెరా (iPhone 13 Pro Max)
– 12MP కెమెరా (సెల్ఫీలు, వీడియో చాట్)
– 6.7 అంగుళాల డిస్ ప్లే (17.02 cm) రెజుల్యుషన్ 1284 x 2778 ఫిక్సల్స్
– లైట్ సెన్సార్, ప్రాగ్జిమిటీ సెన్సార్, యాక్సెలరోమీటర్, బారోమీటర్, కంపాస్, గైరోస్కోప్