Artist Priya : అప్పుడు.. ఇప్పుడు.. నాగార్జునతో ప్రియ.. పిక్ వైరల్..

‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్.. పాపులర్ తెలుగు యాక్ట్రెస్ మామిళ్ల శైలజ ప్రియ, ‘కింగ్’ నాగార్జునతో తనకున్న అనుబంధం గురించి తెలుపుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది..

Artist Priya : అప్పుడు.. ఇప్పుడు.. నాగార్జునతో ప్రియ.. పిక్ వైరల్..

Artist Priya

Artist Priya: చూడచక్కని రూపం.. చూడగానే ఆకట్టుకునే అందం ప్రియ సొంతం.. తెలుగులో ఎన్నో సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ప్రియ పలు సీరియల్స్‌‌లోనూ నటించింది. మామిళ్ల శైలజ ప్రియ ఆమె పూర్తి పేరు. 1997లో జగపతి బాబు – సౌందర్య జంటగా వచ్చిన ‘దొంగాట’ ప్రియ ఫస్ట్ మూవీ.

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రాజశేఖర్ వంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, నాగ చైతన్య, అల్లరి నరేష్, సాయి ధరమ్ తేజ్ వంటి ఈ జెనరేషన్ హీరోల సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. రీసెంట్‌గా ఆమె ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)

ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ హోస్ట్ ‘కింగ్’ నాగార్జునతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ప్రియ తన ఇన్‌‌స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాగార్జునతో కలిసి తొలిసారి ‘చంద్రలేఖ’ సినిమాలో నటించింది ప్రియ.

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)

కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ‘చంద్రలేఖ’ మూవీలోని పిక్, ‘బిగ్ బాస్’ స్టేజ్ మీద నాగార్జునను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటో ఎడిట్ చేసి.. ‘23 సంవత్సరాల నుంచి ఈ మెమరీ నన్ను ఫాలో అవుతూ.. బిగ్ బాస్ ప్లాట్‌ఫాం వరకు తెచ్చింది.. థ్యాంక్యూ నాగార్జున గారు’.. అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ‘చంద్రలేఖ’ 1998 జూలై 30న రిలీజ్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)

Pics and Video Credit by:@priyaartist
instagram