Jio Cinema : జియో సినిమా ఓటీటీలో రిలీజ్‌‌కి ప్లాన్.. కానీ ముందే టెలిగ్రామ్‌లో లీక్ అయిన వెబ్ సిరీస్..

ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు డైరెక్ట్ గా జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పలు సిరీస్ లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసుర్ 2 సిరీస్ ఇటీవలే జియో సినిమాలో రిలీజ్ అయింది.

Jio Cinema : జియో సినిమా ఓటీటీలో రిలీజ్‌‌కి ప్లాన్.. కానీ ముందే టెలిగ్రామ్‌లో లీక్ అయిన వెబ్ సిరీస్..

Asur 2 Series leaked in Telegram before Jio Cinema ott streaming

ASUR 2 : జియో సినిమా(Jio Cinema) అతిపెద్ద ఓటీటీగా అవతరించడానికి చాలా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇటీవల ఒకేసారి ఏకంగా 100 సినిమాలు, సిరీస్ లను ప్రకటించి అవి త్వరలోనే జియో సినిమా ఓటీటీ(OTT)లో రాబోతున్నాయని ప్రకటించింది. IPL ఫ్రీగా టెలికాస్ట్ చేయడంతో జియో సినిమాకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకొని పూర్తిస్థాయి ఓటీటీగా మార్చాలని చూస్తున్నారు.

ఇప్పటికే జియో సినిమాలో కొన్ని సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఓ సినిమాని ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు డైరెక్ట్ గా జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పలు సిరీస్ లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసుర్ 2 సిరీస్ ఇటీవలే జియో సినిమాలో రిలీజ్ అయింది.

Naseeruddin Shah : సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు.. అవార్డులని నా బాత్రూం హ్యాండిల్స్‌గా వాడతాను అంటూ..

గతంలో VOOT ఓటీటీలో వచ్చిన క్రైం థ్రిల్లర్ సిరీస్ అసుర్ మంచి విజయం సాధించింది. ఈ సిరీస్ కి కొనసాగింపుగా అసుర్ 2 తీశారు. దీన్ని జియో సినిమా తీసుకుంది. అయితే మొదట రోజుకొక ఎపిసోడ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంది జియో. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించడానికి జియో సినిమా రోజుకి ఒక ఎపిసోడ్ ని రిలీజ్ చేయాలనుకుంది. కానీ జియో కంటే ముందే అన్ని ఎపిసోడ్స్ టెలిగ్రామ్ లో లీక్ అయ్యాయి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న అసుర్ 2 సిరీస్ జియో కంటే ముందే టెలిగ్రామ్ లో వచ్చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకొని చేసేదేం లేక జియో అని ఎపిసోడ్స్ ని స్ట్రీమింగ్ చేసింది. అయితే టెలిగ్రామ్ లో ఈ సిరీస్ ముందే లీక్ అవ్వడంపై సీరియస్ యాక్షన్ తీసుకోడానికి ప్లాన్ చేస్తుంది జియో సినిమా.