Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌తో దుమ్ములేపిన అవతార్-2

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా గ్రాండియర్‌ను, విజువల్ ఎఫెక్ట్స్‌ను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు తొలిరోజే థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌తో దుమ్ములేపిన అవతార్-2

Avatar 2 Stunning Collections In Telugu States

Avatar 2: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా గ్రాండియర్‌ను, విజువల్ ఎఫెక్ట్స్‌ను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు తొలిరోజే థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘Avatar 2’ in Andhra Pradesh: అవతార్-2 సినిమా చూస్తూ పెద్దాపురంలో ఒకరి మృతి

ఇక ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చడంతో ఈ సినిమా తొలిరోజే అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవతార్-2 మొదటి రోజున ఏకంగా రూ.14 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. ఒక హాలీవుడ్ మూవీ ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం సరికొత్త రికార్డని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజున కేవలం రూ.5.4 కోట్లు మాత్రమే వసూళ్లను రాబట్టింది. అయితే ఆ సినిమాకు ప్రీమియర్స్ కూడా కలపడంతో ఈమేరకు వసూళ్లు వచ్చాయి.

Avatar 2: అవతార్-2 సినిమా కాదంటోన్న వర్మ.. అది నేరమట!

కానీ, అవతార్-2 ఎలాంటి ప్రీమియర్ షోలు లేకుండా తొలిరోజునే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం, ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో తెలియజేస్తుందని సినీ లవర్స్ అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున రూ.40-50 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు రాబట్టి ఉంటుందని మార్కెట్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ వీకెండ్ ముగిసేసరికి అవతార్-2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.