Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఒక పక్క అన్న నాగచైతన్య లవ్ స్టోరీ రిలీజ్, మరో పక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వస్తున్న తమ్ముడు సినిమాలతో పాటు..

Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

Akkineni Heroes

Akkineni Heroes: అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఒక పక్క అన్న నాగచైతన్య లవ్ స్టోరీ రిలీజ్, మరో పక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వస్తున్న తమ్ముడు సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన నాగచైతన్య, సమంత ఇష్యూ ఓ దారికి రావడంతో తెగ ఆనందపడిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అక్కినేని హీరోల సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అవుతుండడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ మూడ్ లోఉన్నారు.

Tamannaah: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తగ్గేది లేదంటున్న తమన్నా!

లేటెస్ట్ గా అఖిల్ తన సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ స్టోరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అక్టోబర్ 8న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. దీనికి సంబందించి వన్ బై వన్ సాంగ్స్ రిలీజ్, ప్రోమోలు, వీడియోలతో హడావిడి చేస్తున్నాడు అఖిల్ . ముందు నుండి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ తో పాటు ఈ వీడియోలతో ఇంకా సినిమాకు హైప్ రావడంతో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఫ్యాన్స్ .

Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

అఖిల్ సినిమా కన్నా ముందే రిలీజ్ అవుతోంది నాగచైతన్య లవ్ స్టోరీ. సాయిపల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రిలీజ్ అవుతున్న సినిమా లవ్ స్టోరీ. చాలా కాలం నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న లవ్ స్టోరీ.. సెప్టెంబర్ 24న ధియేటర్లోకి రాబోతోంది. లవ్ స్టోరీని నాగార్జున కూడా అక్కినేని నాగేశ్వరరావ్ ప్రేమ్ నగర్ తో కంపేర్ చెయ్యడంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్లిపోయింది. దాంతో ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో పాటు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా కనిపించడంతో హిట్ గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్ .

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

సినిమా రిలీజ్ లతో పాటు.. అక్కినేని ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా మారిన సమంత, నాగచైతన్య విడాకుల రూమర్స్ మీద కూడా క్లారిటీ వచ్చింది. కొన్నాళ్లనుంచి సమంత నాగచైతన్య విడిపోతున్నారంటూ గాసిప్స్ వినపడుతున్నాయి. అయితే లవ్ స్టోరీ ట్రైలర్ ని సమంత షేర్ చేసి బెస్ట్ విషెస్ చేస్తూ ట్వీట్ పెడితే.. థాంక్యూ శ్యామ్ అంటూ చైతన్య రిప్లై ఇవ్వడంతో హమ్మయ్య ఏం లేదు.. అంతా బానే ఉందని ఆనందపడుతున్నారు అక్కినేని అభిమానులు.