Balakrishna: మూడు దశాబ్దాల తరువాత ఆ ఫీట్ సాధించిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ సినిమా సక్సెస్‌తో బాలయ్య మూడు దశాబ్దాల తరువాత ఓ అరుదైన ఫీట్ సాధించారు.
Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ సినిమా సక్సెస్‌తో బాలయ్య మూడు దశాబ్దాల తరువాత ఓ అరుదైన ఫీట్ సాధించారు.
Balakrishna : చెత్త సినిమాని అద్భుతంగా చేసేది వాళ్ళే.. మంచి సినిమాని చెడగొట్టేది వాళ్ళే.. బాలకృష్ణ!
బాలయ్య కెరీర్లో ఒక బ్లాక్‌బస్టర్ తరువాత ఖచ్చితంగా ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్ గతకొంత కాలంగా నడుస్తోంది. ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత కనీసం 3-4 ఫ్లాపులు బాలయ్య కెరీర్లో వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సెంటిమెంట్‌ను బాలయ్య బ్రేక్ చేశాడు. బాలయ్య గతచిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్‌గా వీరసింహారెడ్డి కూడా సత్తా చాటింది.
Balakrishna : మొన్న చిరు, ఇవాళ బాలయ్య.. డైరెక్టర్లకు చురకలు!
ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలుగా 1993లో ‘బంగారు బుల్లోడు’, 1994లో ‘భైరవద్వీపం’తో బాలయ్య సత్తా చాటాడు. ఇప్పుడు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ బాలయ్య ఈ ఫీట్‌ను రిపీట్ చేయడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య నెక్ట్స్ మూవీని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.