Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్

ఆహా 'అన్ స్టాపబుల్ విత్ NBK'లో సెలబ్రిటీలతో హడావిడి చేస్తున్నాడు. తాజాగా త్వరలో రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం........

Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్

Balayya

Balakrishna :  నందమూరి బాలకృష్ణ గత కొద్ది రోజుల నుంచి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక పక్క ఆహా ఓటిటిలో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ కార్యక్రమంతో సందడి చేస్తున్నాడు. తాజాగా ‘అఖండ’ సినిమా హిట్ అవ్వడంతో మరింత జోష్ లో ఉన్నారు. ఆహా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’లో సెలబ్రిటీలతో హడావిడి చేస్తున్నాడు. తాజాగా త్వరలో రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మరియు అనీల్ రావిపూడిలు కలిసి వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

Thaman : బాలీవుడ్‌కి గుడ్‌బాయ్ చెప్పేసిన తమన్

అయితే ఈ ఎపిసోడ్ లో బ్రహ్మానందం బాలయ్యబాబుని ఏఎన్ఆర్ ను ఇమిటేట్ చేయండి అనడంతో.. బాలకృష్ణ ఏఎన్ఆర్ చెప్పిన ఓ భారీ డైలాగ్ ని అలవోకగా చెప్పేసారు. దీని మధ్యలో బ్రహ్మానందం కూడా తోడయ్యారు. డైలాగ్ చెప్తూ చెప్తూ బాలయ్య సరదాగా బ్రహ్మానందం మీదికి వెళ్లి మరీ చెప్పారు. షోలో ఉండి ఈ సీన్ చూసిన వాళ్లంతా పడీ పడీ నవ్వుతున్నారు. ప్రోమోలోనే ఇంత హాస్యాన్ని పండించారంటే ఈ ముగ్గురు కలిసి ఎపిసోడ్ లో ఎంత కామెడీ సృష్టించారో అని ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.