Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!

టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదలుకొని, జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆ ఫ్యామిలీ నుండి....

Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!

Balakrishna: టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదలుకొని, జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆ ఫ్యామిలీ నుండి పలువురు హీరోలుగా తెలుగు సినిమా రంగంలో తమ సత్తా చాటారు. అయితే వారిలో కొందరు కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా డైరెక్టర్లుగా, నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటి టాలీవుడ్‌లో పలు సినిమాలను తెరకెక్కించారు. అటు ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా తనలోని మల్టీ ట్యాలెంట్‌ను ఇప్పటికే మనకు చూపించారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్ఎటి, ఆర్కే ఎన్ఎటి, రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిల్మ్ యూనిట్, రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోస్, శ్రీమతి కంబైన్స్ వంటి పలు బ్యానర్లపై సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.

Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్..?

ఇటు బాలయ్య కూడా తన సొంత బ్యానర్ ఎన్‌బికె ఫిలింస్‌పై ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక యంగ్ హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ఇంకా పలు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుండి మరొక కొత్త బ్యానర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పెద్దకొడుకు అయిన జయకృష్ణ ఈ ప్రొడక్షన్ హౌజ్‌ను స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ‘‘బసవతారకరామ క్రియేషన్స్’’ అనే పేరుతో ఈ ప్రొడక్షన్ హౌజ్ రాబోతుందని.. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను నందమూరి బాలకృష్ణ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Balakrishna : మరోసారి బాలయ్య, తమన్ మాస్ బీట్.. జోడిగా ఖిలాడీ భామ

నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని మే 28న ఈ అనౌన్స్‌మెంట్ రాబోతుందని వారు తెలిపారు. అయితే ఈ నిర్మాణ సంస్థలో జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన గతంలో జగపతి బాబు హీరోగా నటించిన ‘ధమ్’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు ఇన్నాళ్ల గ్యాప్ తరువాత హీరోగా మారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌లో రాబోతున్న తొలి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ రోజున చెబుతారా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.