Balakrishna : మోహన్ బాబుతో మొదలు పెట్టనున్న బాలకృష్ణ

ఆహా 'అన్‌స్టాప‌బుల్ విత్ NBK' సెట్ లో నటసింహం బాలయ్యతో కలిసి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మొదటి ఎపిసోడ్ లో

Balakrishna : మోహన్ బాబుతో మొదలు పెట్టనున్న బాలకృష్ణ

Balayya

Balakrishna :  ఇన్నాళ్లు సినిమాలతో అలరించిన బాలయ్య బాబు తాజాగా యాంకర్ గా కూడా అదరగొట్టబోతున్నారని తెలిసిందే. తెలుగు ఓటిటి ఆహా కోసం ‘అన్‌స్టాప‌బుల్ విత్ NBK’ అనే షోని బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ షోలో సినీ సెలబ్రిటీలని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ ప్రోగ్రాం దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది.

Varudu Kaavalenu : అలా చైతుకి బదులు శౌర్య వచ్చాడు

తాజాగా ఈ షోకి వ‌చ్చే మొదటి గెస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఈ షో నుంచి లీక్ అయిన ఓ పిక్ చెప్పేస్తుంది ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా ఎవరు వచ్చారో. ఆహా ‘అన్‌స్టాప‌బుల్ విత్ NBK’ సెట్ లో నటసింహం బాలయ్యతో కలిసి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మొదటి ఎపిసోడ్ లో మోహ‌న్ బాబుతో బాల‌కృష్ణ సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. బాలకృష్ణ, మోహన్ బాబులు ఇద్దరు ఇలాంటి టాక్ షోల్లో కనిపించడం చాలా తక్కువ. అలాంటిది వీళ్లిద్దరి కాంబినేషన్లోనే మొదటి ఎపిసోడ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ గా ఉండబోతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు.

Greeshma Nethrikaa : చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడెలా ఉందో చూశారా!

ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ సందర్భంగా మోహన్ బాబు కొద్ది రోజులు ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో మనకు తెలుసు. మరి ఆ ఫైర్ ఇప్పుడు కూడా చూపిస్తారా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ అయిన తర్వాత మోహన్ బాబు బాలకృష్ణని కలిశారు కూడా. ఇక మోహన్ బాబు, బాలకృష్ణ స్పీచ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ఈ షోలో కూడా వాళ్ళిద్దరి మాటల పవర్ చూపిస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ పూర్తి అయినట్టు, దీని టీజర్ త్వరలోనే రాబోతుందని సమాచారం.