Balakrishna: ఫిటింగ్‌లు పెట్టేదెవరూ? టీడీపీ పగ్గాలు బాలయ్య ఎందుకు తీసుకోలేదు?

టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండగా.. ‘ఆహా’ OTTలో ప్రసారం కాబోతున్న టాక్ షో "అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable)".

Balakrishna: ఫిటింగ్‌లు పెట్టేదెవరూ? టీడీపీ పగ్గాలు బాలయ్య ఎందుకు తీసుకోలేదు?

Balayya Manchu

Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండగా.. ‘ఆహా’ OTTలో ప్రసారం కాబోతున్న టాక్ షో “అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable)”. ఇప్ప‌టికే విడుదలైన ఈ షో ప్రోమోతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశాడు బాల‌య్య‌. ఈ టాక్ షోకి ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు అతిథులుగా రాబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

ఈ షోకి ఫస్ట్ గెస్ట్‌గా మంచు మోహ‌న్ బాబు రాగా.. ఆయనతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మీ కూడా విచ్చేశారు. ఈ షో కి సంబంధించిన ప్రోమోలో ఆసక్తికర విషయాలు ఇంటర్వ్యూలో వచ్చినట్లు అర్థం అవుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ, మోహన్ బాబు రెండు వేర్వేరు పార్టీల్లో ఉండగా.. వీరి మధ్య పొలిటికల్ సంభాషణ ఆసక్తకరం.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

ఈ షోలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు అప్పగించారు? అని మోహన్ బాబు అడగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రాణ సమానమైన, అన్నగారి పార్టీని మీరెందుకు వదిలేశారు? అని మోహన్ బాబును బాలయ్య ప్రశ్నించారు.

Unstoppable Episode 1 Promo

 

ఈ సమయంలోనే ఎవరో ఫిటింగులు పెడుతుంటారు అంటూ చెప్పుకొచ్చారు.. ఎవరు ఆ ఫిటింగ్‌లు పెట్టారు అనే విషయం పూర్తి షో చూస్తే తెలుస్తుంది. అరవిందే.. నన్ను ఈ ప్రశ్న అడగమని చెప్పి ఉంటారు? అంటూ కాస్త ఇంట్రస్టింగ్‌గానే షో సాగబోతుంది అన్నట్లుగా చూపించారు ప్రోమోలో. చూడాలి మరి షో ఎలా ఉండబోతుందో? అన్‌స్టాప‌బుల్ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4 నుంచి ఆహాలో ప్రీమియ‌ర్ అవ్వనుంది.