Mahesh Babu: మహేష్ ఫ్యాన్‌కు మసూద పాప రిప్లై.. అంటే అన్నారు కానీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన అభిమానులు నిత్యం సోషల్ మీడయాలో ఏదో ఒక విషయంపై చర్చిస్తుంటారు. తాజాగా ఓ మహేష్ అభిమాని చేసిన కామెంట్‌కు ఓ హీరోయిన్ రిప్లై ఇవ్వడంతో, ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్‌కు మసూద పాప రిప్లై.. అంటే అన్నారు కానీ..!

Bandhavi Sridhar Reply To Mahesh Babu Fan Goes Viral

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన అభిమానులు నిత్యం సోషల్ మీడయాలో ఏదో ఒక విషయంపై చర్చిస్తుంటారు. తాజాగా ఓ మహేష్ అభిమాని చేసిన కామెంట్‌కు ఓ హీరోయిన్ రిప్లై ఇవ్వడంతో, ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

Masooda Movie: సైలెంట్ హిట్‌గా దూసుకుపోతున్న ‘మసూద’.. ఆగనంటోందిగా!

ఇటీవల టాలీవుడ్‌లో హార్రర్ మూవీగా వచ్చిన ‘మసూద’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో సంగీత, తిరువీర్, బాంధవి శ్రీధర్ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో బాంధవి శ్రీధర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. కాదు భయపెట్టింది. చాలా రోజుల తరువాత ఓ హార్రర్ మూవీ తెలుగులో హిట్ అవడం ‘మసూద’కే చెందింది. ఇక ఈ సినిమాను తాజాగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేస్తోంది ఆహా.

దీంతో ఇప్పుడు ఈ సినిమా గురించి నెట్టింట చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహేష్ అభిమాని బాంధవి శ్రీధర్, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయితే చూడాలని ఆశగా ఉందంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు బాంధవి శ్రీధర్ తనదైన స్టయిల్‌లో రిప్లై ఇచ్చింది. ‘‘అత్యాశ అనుకోండి.. కానీ.. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బావుంది’’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.