Telangana : లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? బండి సంజయ్

మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు.లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ ఎద్దేవా చేశారు.

Telangana : లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? బండి సంజయ్

Bandi Sanjay criticizes CM KCR and MLC Kavitha

Telangana : మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఓ మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవిత బినామీనని..ఆయన ఆదేశాల మేరకే తాను ఆర్థిక లావాదేవీలు జరిపాను అంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై ఈడీ విచారణలో తేటతెల్లం చేశారని మరి ఇప్పుడు బీజేపీపై అర్థం పర్థంలేని విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేమంటారు? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయిన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్.

దొంగ సారా, పత్తాల దందా చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదని..లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ వంచదంటూ కవిత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. డిస్కోలు, రికార్డింగ్ డ్యాన్స్ లతో బతుకమ్మకే గౌరవం లేకుండా చేసిన కవితకు తెలంగాణ గౌరవం గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ చేసిన లిక్కర్ దందా వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధం?
అని ప్రశ్నించిన బండి సంజయ్ కవిత దొంగ దందా సొమ్ముతో తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. తలంచని తెలంగాణ కేసీఆర్ బిడ్డ దొంగ దందాతో దేశం ముందు తలదించుకునే పరిస్థితి కల్పించారంటూ దుయ్యబట్టారు. కవిత అక్రమ సంపాదన అంతా లిక్కర్ స్కామ్ లో పెట్టారని ఇప్పుడు అదికూడా పోయిందని మరోపక్క అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందని ఇదంతా తెలంగాణ ప్రజల్ని వంచించిన పాపం అంటూ విమర్శించారు.

కేసీఆర్ ఫ్యామిలీలో ఒక వికెట్ అవుట్ అయ్యిందని ఇక అన్నీ అవుట్ అవుతాయని జోస్యం చెప్పారు బండి సంజయ్. లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందన్నారు. ఇక కేసీఆర్ పాలనలో సామాన్య మహిళలకు గౌరవమొక్కడిది అంటూ ప్రశ్నించారు.మోదీ పాలనకు-కేసీఆర్ పాలనకు ఉన్న తేడాను బేరీజు వేసుకుని చూస్తే అంతా తెలుస్తుందని సూచించారు. మహిళలు తలెత్తుకునేలా చేస్తున్న పాలన మోదీది..కానీ మహిళలు తల దించుకునే పాలన కేసీఆర్ అని..మహిళలు సగౌరవంగా తల ఎత్తుకుని భద్రతతో జీవించాలంటే బీజేపీ పాలన రావాలని దాని కోసం మహిళ అంతా అండగా నిలబడాలి అని పిలుపునిచ్చారు బండి సంజయ్.