Kalyan Krishna : ‘బంగార్రాజు’ డైరెక్టర్‌కి తమిళ్ నుంచి భారీ ఆఫర్

తమిళ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ 'బంగార్రాజు' దర్శకుడికి భారీ ఆఫర్ ఇచ్చింది. స్టూడియో గ్రీన్ సంస్థ తెలుగులో చాలా సినిమాలు నిర్మించింది. ఈ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజ్.....

Kalyan Krishna : ‘బంగార్రాజు’ డైరెక్టర్‌కి తమిళ్ నుంచి భారీ ఆఫర్

Kalyan Krishna

Bangarraju :  ఈ సంక్రాంతికి నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా మంచి విజయం సాధించింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో భారీ వసూళ్లు కూడా సాధిస్తుంది. సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ కి ఈ సినిమా మరింత పేరు తెచ్చిపెట్టింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. తాజాగా వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు కళ్యాణ్. దీంతో కళ్యాణ్ కృష్ణకి భారీ ఆఫర్ వచ్చింది.

Evam Jagath : రూపాయికే సినిమా.. మంచి సినిమా కోసం కొత్త దర్శకుడి తాపత్రయం

తమిళ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ‘బంగార్రాజు’ దర్శకుడికి భారీ ఆఫర్ ఇచ్చింది. స్టూడియో గ్రీన్ సంస్థ తెలుగులో చాలా సినిమాలు నిర్మించింది. ఈ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజ్ నిన్న బంగార్రాజు దర్శకుడిని కలిసి అభినందించారు. కళ్యాణ్ కృష్ణతో త్వరలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ బడ్జెట్ తో ఉండొచ్చని తెలుస్తుంది. త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని ఆ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో కళ్యాణ్ భారీ ఆఫర్ పట్టాడని అభినందిస్తున్నారు.