Best Smartwatches : భారత్‌లో రూ. 15వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే..!

Best Smartwatches : స్మార్ట్‌వాచ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ వాచ్ కూడా స్మార్ట్ ఫోన్ల మాదిరి ఫీచర్లతో వచ్చేశాయి.

Best Smartwatches : భారత్‌లో రూ. 15వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే..!

Best Smartwatches To Buy In India Under Rs 15,000 (1)

Best Smartwatches : స్మార్ట్‌వాచ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ వాచ్ కూడా స్మార్ట్ ఫోన్ల మాదిరి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం వాచ్ టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు.. స్మార్ట్ ఫోన్లలో అందించే మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌ల్లో మెసేజ్ లు చెక్ చేసుకోవడమే కాదు.. మ్యూజిక్ వినొవచ్చు.. మీ ఆరోగ్యం ఎలా ఉండో చెక్ చేసుకునేందుకు హెల్త్ ట్రాకర్ కూడా ఉంది. ఇప్పటికే చాలా స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్యానికి సంబంధించి పలు డిటెక్టర్ ఫీచర్లను అందిస్తున్నాయి. ప్రధాన స్మార్ట్ వాచ్‌ల్లో Fitbit, Huawei, Amazfit వంటి అనేక బ్రాండ్‌లు అనేక మోడల్స్ అందిస్తున్నాయి. మీ హెల్త్ ట్రాక్ చేయడంలో స్మార్ట్‌వాచ్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి.

స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువని భావిస్తుంటారు. అయితే భారత మార్కెట్లో లభించే పలు స్మార్ట్ వాచ్ బ్రాండ్లలో కేవలం రూ.15వేల లోపు స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు స్మార్ట్ వాచ్ కొనుగోలుపై రూ.15వేల వరకు ఖర్చు పెట్టగలరా? అయితే ఈ కింది వేరబుల్ స్మార్ట్ వాచ్ బ్రాండ్లు, వాటి ధరలు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లలో మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్ వాచ్ మోడల్ కొనుగోలు చేసుకోవచ్చు. ప్రీమియం వాచ్‌లతో కలిగే బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. మీ ఆరోగ్యంపై అంచనా వేయడంలో స్మార్ట్ వాచ్‌లు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ స్మార్ట్ వాచ్ లలో సెన్సార్‌ల సాయంతో ట్రాకింగ్ చేసుకోవచ్చు. రూ. 15,000లోపు కొన్ని బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను మీకు అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ వాచ్ ఎంపిక చేసుకుని కొనుగోలు చేయవచ్చు.

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల జాబితా ఇదే :
ఫిట్‌బిట్ వెర్సా 2 (Fitbit Versa 2) :
ఫిట్‌బిట్ అంటే.. ఫిట్‌నెస్ వేరబుల్స్.. చాలామందికి తెలిసిన బ్రాండ్. మీరు Fitbit Versa 2 స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయొచ్చు. ఆకర్షణీయమైన డయల్‌తో పాటు చాలా తేలికపాటి డిజైన్‌ కలిగి ఉంది. రోజంతా ఈ స్మార్ట్ వాచ్ ధరించినా ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ స్మార్ట్ వాచ్ లను చేతికి ధరించడం ద్వారా మీరు ఎల్లప్పుడూ హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, నిద్ర, స్టెప్స్ ట్రాకింగ్ మరిన్ని వంటి ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు. ఈ Fitbit వాచీలతో ఖచ్చితమైన రీడింగ్‌లతో పాటు వివరణాత్మక డేటాను పొందవచ్చు. ఈ వాచ్‌లో Spotifyని ఉపయోగించి మ్యాజిక్ ప్లే చేయవచ్చు. Amazon Echo డివైజ్‌లను కూడా కంట్రోల్ చేయొచ్చు. స్విమ్ ప్రూఫ్ డిజైన్‌తో పాటు మైక్రోఫోన్‌ను కలిగి ఉంది.

Best Smartwatches To Buy In India Under Rs 15,000

Best Smartwatches To Buy In India Under Rs 15,000

ఈ వాచ్‌ ద్వారా కాల్స్ కూడా చేసుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ డివైజ్ సాధారణ వినియోగంతో 5 రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. అంటే.. ఇదో పర్ఫెక్ట్ వాచ్ అని అర్థం కాదని అంటోంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో అతి పెద్ద లోపం ఏమిటంటే.. ఈ స్మార్ట్ వాచ్‌లో GPSకి సపోర్టు లేదు. GPS ట్రాకింగ్ కోసం ఫోన్‌పై ఆధారపడాల్సిందే. దీని ట్రాకర్ కు దూరంగా వెళ్లే సమయంలో తప్పకుండా మీ ఫోన్ వెంట తీసుకెళ్లండి. ఫిట్‌బిట్ వెర్సా 3 ఇప్పటికే ఆకర్షణీయమైన డిజైన్‌తో అనేక ఫీచర్లతో వచ్చిన వెర్సా 2ని కొనుగోలు చేసేవారు Versa 3 ధర రూ. 17,499గా ఉంటే.. (Fitbit Versa 2) 2 ధర రూ. 13,79గా ఉంటుంది.

ఒప్పో వాచ్ (Oppo Watch) :
Oppo వాచ్ 41mm Wi-Fi మోడల్‌ను ఓసారి చెక్ చేయండి. ప్రత్యేకించి హెల్త్ ట్రాకింగ్ కోసం ఈ వాచ్ కొనుగోలు చేయొచ్చు. రూ. 15,000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఇది ఒకటి. మంచి వ్యూయింగ్ యాంగిల్స్‌తో పవర్ ఫుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ యాపిల్ వాచ్‌ని పోలి ఉంటుంది. ఈ డివైజ్ అల్యూమినియం కేస్ కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ యూజర్లు ప్రీమియం వాచ్ వంటి అనుభూతిని పొందవచ్చు. ఈ వాచ్ డివైజ్ ద్వారా మెసేజ్ నోటిఫికేషన్‌లు, స్టెప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో కనెక్ట్ చేసుకోవచ్చు.

స్మార్ట్ వాచ్ యూజర్లు.. ఫిట్‌నెస్ రన్, ఫ్యాట్ బర్న్ రన్, అవుట్‌డోర్ సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటిని కూడా ట్రాక్ చేయగలరు. దూర ట్రాకింగ్ కోసం GPS సపోర్టు కూడా ఉంది. ఈ వాచ్‌ ద్వారా ఒకరు మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వవచ్చు. ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఒకసారి రీచార్జ్ చేస్తే.. 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ పొందవచ్చునని కంపెనీ పేర్కొంది. Oppo వాచ్ (41mm) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,990కి అందుబాటులో ఉంది.

Best Smartwatches To Buy In India Under Rs 15,000 (2)

Best Smartwatches To Buy In India Under Rs 15,000

అమాజ్‌ఫిట్ (Amazfit GTS 2) :
రన్నింగ్, సైక్లింగ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ వంటి బహిరంగ కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు ఈ స్మార్ట్ వాచ్ అద్భుతంగా పనిచేస్తుంది. 1.65-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు ఇంటర్నల్ GPS సౌకర్యాన్ని కూడా Amazfit GTS 2 కలిగి ఉంది. BioTracker 2 PPG ఆప్టికల్ సెన్సార్ ఈ డివైజ్‌లో ఉంది. హృదయ స్పందన రేటును అంచనా వేయడంలో సాయపడుతుంది. రక్తం-ఆక్సిజన్ స్థాయిలను కూడా అంచనా వేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది.

మీ నిద్రను కూడా ఈ వాచ్ ట్రాక్ చేయగలదు. ఈ వాచ్ అవుట్‌డోర్ రన్నింగ్, వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, పూల్ స్విమ్మింగ్, క్లైంబింగ్, అవుట్‌డోర్ సైక్లింగ్ మరిన్నింటితో సహా 90+ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ డివైజ్ 3GB స్టోరేజీ కూడా అందిస్తోంది. ఈ వాచ్ సాయంతో తమ మ్యూజిక్ ప్లే లిస్టును ఇతర యూజర్లకు కూడా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

Best Smartwatches To Buy In India Under Rs 15,000 (3)

Best Smartwatches To Buy In India Under Rs 15,000

Huawei వాచ్ GT 2 (Huawei Watch GT 2) :
స్మార్ట్ వాచ్‌లలో ఇదో బెస్ట్ స్మార్ట్ వాచ్.. 46mmతో సామర్థ్యాన్ని కలిగిన Huawei Watch GT 2 (46mm) ఈ స్మార్ట్ వాచ్… 1.39-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా 15 స్పోర్ట్స్ ట్రాకింగ్ ఫీచర్‌లు 8 అవుట్‌డోర్ స్పోర్ట్స్‌ను కలిగి ఉంది. వీటిలో రన్నింగ్, వాకింగ్, క్లైంబింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ పూల్, ఉచిత శిక్షణ, ఎలిప్టికల్ మెషిన్ మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. హృదయ స్పందన రేటుతో పాటు నిద్ర విధానాలను కూడా ట్రాక్ చేయగలదు. స్మార్ట్ వాచ్ యూజర్లు ఈ వాచ్‌ని ఉపయోగించి ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.

Best Smartwatches To Buy In India Under Rs 15,000 (4)

Best Smartwatches To Buy In India Under Rs 15,000

Huawei Watch GT 2 యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ఎయిర్ ప్రెజర్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్, ఆప్టికల్ హార్ట్ రేట్ కెపాసిటివ్ సెన్సార్ వంటి సెన్సార్‌లతో వస్తుంది. 5ATM రేట్ ఉంది. అంతేకాదు.. వాటర్ రిసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని Huawei పేర్కొంది. Huawei Watch GT 2 ధర రూ. 12,490కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Fitbit Smart Watches: గూగుల్ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్.. పది లక్షల వాచ్‌లు రిటర్న్