Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

‘భీమ్లా నాయక్’ గా వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో రికార్డుల రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు.. పవర్ స్టార్..

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

Bheemla Nayak

Pawan Kalyan: ‘నేను ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు.. ట్రెండ్ సెట్ చేసే టైప్’ అంటూ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన పాపులర్ డైలాగ్.. ఆయన విషయంలో మరోసారి నిజమని నిరూపితమైంది. ఇప్పుడు పాత రికార్డుల దుమ్ము దులిపి సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు పవర్‌స్టార్.

పవన్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇండిపెండెన్స్ డే కానుకగా వదిలిన పవన్ వీడియో నెట్టింట బీభత్సంగా వైరల్ అయ్యింది.

Making Glimpse : పవన్ – రానా.. ఎవరూ తగ్గట్లేదుగా..

పవర్ స్టార్ మరోసారి తన స్టైల్లో రెచ్చిపోయారు. లుంగీ కట్టి, వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో రికార్డుల రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు. పవర్ స్టార్ గెటప్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ రేర్ రికార్డ్ సెట్ చేసింది.

విడుదల చేసిన 24 గంటల్లో 8.49 మిలియన్ల వ్యూస్, 728.6 K లైక్స్‌తో అదిరిపోయే రికార్డ్ సెట్ చేశారు ‘భీమ్లా నాయక్’. ఇది ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్ కావడం విశేషం. నిత్యా మీనన్, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ క్రేజీ మూవీ 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Nithya Menen: భీమ్లా నాయక్ భార్యగా..

సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే- డైలాగ్స్ రాస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు.