Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా??

'భీమ్లా నాయక్' సినిమా అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. దాదాపు 80 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు సమాచారం. భీమ్లా నాయక్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్.......

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా??

Bhemla Nayak

Bheemla Nayak :  మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్‌’ ని తెలుగులో ‘భీమ్లా నాయక్’గా రీమేక్ చేశారు. ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో ‘భీమ్లా నాయక్’ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ సాయంత్రం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

 

ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ సినిమా అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. దాదాపు 80 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు సమాచారం. భీమ్లా నాయక్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు…

నైజాం: 35 కోట్లు
సీడెడ్: 16.50 కోట్లు
ఉత్తరాంధ్ర: 9 కోట్లు
ఈస్ట్ గోదావరి: 6.40 కోట్లు
వెస్ట్ గోదావరి: 5.40 కోట్లు
గుంటూరు: 7.20 కోట్లు
కృష్ణా: 6 కోట్లు
నెల్లూరు: 3.25 కోట్లు

Nagarjuna : బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొదలయ్యేది ఆ రోజే.. ప్రోమో విడుదల..

మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 9 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్‌ 106.75 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ‘భీమ్లా నాయక్’ సినిమా బరిలోకి దిగుతుంది.

Adipurush : మన ఇతిహాసాలని జపాన్ వాళ్ళు తీస్తున్నారు.. మనం?.. డైరెక్టర్ ఓంరౌత్ వ్యాఖ్యలు..

టాలీవుడ్ లో పవన్ కోసం తమ సినిమాలని వాయిదా వేసుకున్నారు యువ హీరోలు. మరి తెలుగు రాష్ట్రాల్లో పవన్ మానియా, బాలీవుడ్ లో రానా పాపులారిటీతో భీమ్లా నాయక్ ఏ మేరకు కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.