Sankranti 2022: భీమ్లా కూడా విత్ డ్రా?.. వార్ వన్ సైడ్ అవుతుందా?

రేసు నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. రసవత్తరంగా మారిందనుకున్న సంక్రాంతి పోరు సోలో గానే ఫిక్స్ అయ్యేలా కనిపిస్తోంది. సినిమా మొదలుపెట్టినప్పుడే సంక్రాంతికి వస్తున్నానంటూ ముందే..

Sankranti 2022: భీమ్లా కూడా విత్ డ్రా?.. వార్ వన్ సైడ్ అవుతుందా?

Sankranti 2022 Films

Sankranti 2022: రేసు నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. రసవత్తరంగా మారిందనుకున్న సంక్రాంతి పోరు సోలో గానే ఫిక్స్ అయ్యేలా కనిపిస్తోంది. సినిమా మొదలుపెట్టినప్పుడే సంక్రాంతికి వస్తున్నానంటూ ముందే ఖర్చీఫ్ వేసుకున్న మహేష్ బాబు మొన్నీమధ్యే తూచ్.. నేను రేస్ లో లేను అంటూ మిడిల్ డ్రాప్ అయ్యాడు. లా లా భీమ్లా అంటూ.. అందరి నోట్లో ఓ రేంజ్ లో నానుతున్న భీమ్లానాయక్ కూడా బరినుంచి బయటికొస్తున్నాడు.

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!

2022 సంక్రాంతి.. సీజన్ అంతా ఖాళీ లేకుండా ఫుల్ గా సినిమాలతో ప్యాక్ అయిపోయిందని సంబరపడిన అభిమానులకు ఆ ఆనందం ఎక్కువ కాలం ఉంచడం లేదు స్టార్లు. ఒకరి తర్వాత ఒకరు సంక్రాంతి రేస్ నుంచి విత్ డ్రా అవుతున్నారు. సర్కారు వారి పాట పోస్ట్ పోన్ గురించి ఇంకా మర్చిపోకముందే భీమ్లానాయక్ కూడా విత్ డ్రా అవుతున్నట్టు ఏకంగా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయినట్టు న్యూస్ నడుస్తోంది.

Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

పవన్ కళ్యాణ్ హీరోగా జనవరి 12 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న భీమ్లానాయక్ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ హోల్డ్ లో ఉన్న భీమ్లానాయక్.. ఇప్పుడు పోస్ట్ పోన్ హింట్ ఇవ్వడంతోనే సంక్రాంతికి రిలీజ్ అనుకున్ననాగార్జున, నాగచైతన్య బంగార్రాజు మూవీ ప్రమోషన్ల స్పీడ్ పెంచిందని టాలీవుడ్ టాక్. మొన్నీమధ్యే షూటింగ్ మొదలుపెట్టిన బంగార్రాజు అప్పుడే ప్రమోషన్లు మొదలుపెట్టేసింది.

RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సంక్రాంతి రిలీజ్ అని అందరూ స్ట్రాంగ్ గా అనుకున్నారు. కానీ జనవరి ఫస్ట్ వీక్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో పాటు జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ ఉండడంతో ఈ రెండు సినిమాల మధ్య రిస్క్ ఎందుకని సినిమా వెనక్కి తగ్గక తప్పడం లేదంటూ రూమర్స్ నడుస్తున్నాయి. అంతేకాదు సినిమా సంక్రాంతి నుంచి ఎర్లీ సమ్మర్ కి పోస్ట్ పోన్ అయినట్టు కూడా టాక్ వినిపిస్తోంది.