Bholaa Shankar: అప్పుడు భాషా.. ఇప్పుడు భోళా శంకర్.. సేమ్ సెంటిమెంట్..?

మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో టాక్సీ డ్రైవర్‌‌గా కనిపిస్తుండటంతో, రజినీకాంత్ మూవీ భాషాతో ఈ సినిమాకు పోలిక ఉందా.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Bholaa Shankar: అప్పుడు భాషా.. ఇప్పుడు భోళా శంకర్.. సేమ్ సెంటిమెంట్..?

Bholaa Shankar Makers Reveal Chiranjeevi New Posters

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ కోసం మెగా ఫ్యాన్స్‌తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఈ సినిమాపై ఫోకస్ పెట్టేలా చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మే డే సందర్భంగా భోళాశంకర్ మూవీ నుండి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.

Bholaa Shankar: మెగాస్టార్ ‘భోళాశంకర్’ నుండి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ స్టార్ట్ చేసిన యూనిట్!

ఈ పోస్టర్స్‌లో వింటేజ్ లుక్‌లో చిరంజీవి ఓ టాక్సీ డ్రైవర్‌గా మనకు కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భోళాశంకర్ మూవీలో చిరు పాత్రను గతంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ భాషా మూవీతో పోలుస్తున్నారు. భాషా మూవీలో తన ఫ్యామిలీ కోసం హీరో ఆటోడ్రైవర్‌గా మారుతాడు. హీరోకు ఓ పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు భోళాశంకర్ మూవీలోనూ హీరో టాక్సీ డ్రైవర్‌‌గా ఉన్నాడంటే.. అతడికి కూడా ఓ పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Bholaa Shankar: భోళాశంకర్ కోసం రెండు డేట్స్.. ఏది ఫిక్స్ చేస్తారో..?

మరి చిరంజీవి నిజంగానే భోళాశంకర్ మూవీలో భాషా సినిమాను మనకు చూపిస్తాడా.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలంకు రీమేక్‌గా తీసుకొస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరో చెల్లి పాత్రలో నటిస్తోంది. మరి భోళాశంకర్ కూడా భాషా సెంటిమెంట్ మనకు కనిపిస్తుందా అనేది చూడాలి.