Bichagadu 2 Twitter Review : బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ.. దీనికంటే కంటే బిచ్చగాడు బెటర్??

విజయ్ కెరీర్ నే మార్చేసిన బిచ్చగాడు కి సీక్వెల్ బిచ్చగాడు 2 నేడు మే 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు.

Bichagadu 2 Twitter Review : బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ.. దీనికంటే కంటే బిచ్చగాడు బెటర్??

Bichagadu 2 Twitter Review audience ratings

Bichagadu 2 :  2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు(Bichagadu) తెలుగులో భారీ విజయం సాధించింది. జస్ట్ 2 కోట్లతో డబ్బింగ్ రైట్స్ కొన్న బయ్యర్లకు ఏకంగా 15 కోట్లు కలెక్ట్ చేసి ఫుల్ గా లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) తెలుగులో బోల్డంత ఇమేజ్, క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు.

విజయ్ కెరీర్ నే మార్చేసిన బిచ్చగాడు కి సీక్వెల్ బిచ్చగాడు 2 నేడు మే 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. ఇందులో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ చేశారు చిత్రయూనిట్. తమిళ్, తెలుగులో రిలీజ్ అవుతోంది.

Bichagadu 2 : బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

ఇప్పటికే ఓవర్సీస్ లో, తమిళనాడులో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాను చుసిన అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. బిచ్చగాడు సినిమాతో పోలిస్తే బిచ్చగాడు 2 అంతగా లేదని, ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి..