Big Boss 5: ఈసీజన్ టైటిల్ విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్‌కు అవకాశం?

మళ్ళీ బుల్లితెర మీద సందడి చేసేందుకు కింగ్ నాగార్జున మరోసారి సిద్దమయ్యాడు. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే.. అందరూ అనుకుంటున్నట్టుగానే బి

Big Boss 5: ఈసీజన్ టైటిల్ విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్‌కు అవకాశం?

Big Boss 5 (1)

Big Boss 5: మళ్ళీ బుల్లితెర మీద సందడి చేసేందుకు కింగ్ నాగార్జున మరోసారి సిద్దమయ్యాడు. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే.. అందరూ అనుకుంటున్నట్టుగానే బిగ్ బాస్ ఈ కొత్త సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫమ్ చేస్తూ షో యాజమాన్యం బిగ్ బాస్ ప్రోమో వదిలారు. ఎన్టీఆర్, నానీల తర్వాత నాగ్ వరుసగా మూడవ సీజన్ కూడా బిగ్ బాస్ హౌస్ కు మెంటార్ కానున్నాడు. హోస్ట్ ఖరారు కావడంతో ఇక కంటెస్టెంట్లు వీరేననే ప్రచారం మరింత ముమ్మరంగా సాగుతుంది.

ఈ కొత్త సీజన్ లో హీరో నిఖిల్, జబర్ధస్ ప్రియాంకా సింగ్, సురేఖా వాణీ, యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, లోబో, టీవీ 9 ప్రత్యుష, ఆర్జే కాజల్, వీజే సన్నీ, నవ్యస్వామి, షణ్ముఖ్, అన్నీ మాస్టర్, ప్రియరామన్ పేర్లు వినిపించగా వీరిలో ఒకరిద్దరు ఇప్పటికే మేము హౌస్ లోకి వెళ్లడం లేదని ప్రకటించగా మిగతా వారిపై ఏవీల షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈనెల 20 నుండి కంటెస్టెంట్లకు క్వారంటైన్ మొదలు కానుండగా వచ్చే నెల నుండి షో మొదలు కానుందని సమాచారం.

కాగా, ఈ సీజన్ లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ పర్సనాలిటీలను తీసుకోవాలని షో యాజమాన్యం ఆలోచనలో ఉందట. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో టైటిల్ గెలుచుకున్న నలుగురు మగవాళ్లే కాగా.. నాల్గవ సీజన్ లో యాంకర్ శ్రీముఖి చివరి వరకు పోరాడగా చివర్లో అనూహ్యంగా అభిజిత్ కైవసం చేసుకున్నాడు. అయితే.. ఐదవ సీజన్ మాత్రం లేడీ కంటెస్టెంట్లను విన్నర్ గా రూపొందించేందుకు షో యాజమాన్యం ప్రయత్నాల్లో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికి ఇంకా షో మొదలు కాలేదు కానీ లేడీ విన్నర్ కోసమే ఈసారి లేడీ కంటెస్టెంట్లను ఎక్కువమందితో పాటు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేవారినే ఎంపిక చేయనున్నారని ప్రచారం జరుగుతుంది.