Bigg Boss 5 : విలన్స్ వర్సెస్ హీరోస్.. బిగ్ బాస్ లో బిగ్ ఫైట్

ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ కోసం ఫైట్‌ నడుస్తోంది. ఇంటిసభ్యులను విలన్స్‌, హీరోస్‌ అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు బిగ్‌బాస్‌. రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ విలన్స్‌

Bigg Boss 5 :  విలన్స్ వర్సెస్ హీరోస్.. బిగ్ బాస్ లో బిగ్ ఫైట్

Bb5

Bigg Boss 5 :  తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పటికే 8 వారాలు పూర్తయింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ కోసం ఫైట్‌ నడుస్తోంది. ఇంటిసభ్యులను విలన్స్‌, హీరోస్‌ అంటూ రెండు గ్రూపులుగా విభజించాడు బిగ్‌బాస్‌. రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ విలన్స్‌ టీమ్‌లో ఉండగా షన్ను, సిరి, శ్రీరామ్, ప్రియాంక, మానస్, కాజల్ లు హీరోస్‌ టీమ్‌లో ఉన్నారు. ఈ టాస్కులో ఇతర టీమ్‌లోని సభ్యులతో ఐ క్విట్‌ అని చెప్పించాలి. అలా చెప్పించడం కోసం అవతలి టీం వాళ్ళకి ఎలాంటి టాస్కు ఐనా ఇవ్వొచ్చు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై అసభ్య‌క‌ర‌మైన పోస్ట్‌ చేసిన యువకుడు అరెస్ట్

ముందుగా తాళాలు తీసుకొని ఎవరైతే స్టోర్ రూమ్ కి వెళ్తారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఆ టీం వాళ్ళు ఇంకో టీంకి టాస్కులు ఇస్తారు. తర్వాత వీళ్ళు టాస్కులు చేస్తారు. అయితే టాస్కులు ఇవ్వడానికి మొదటగా విలన్స్‌కు ఛాన్స్‌ వచ్చింది. దీంతో వాళ్ళు హీరోల టీమ్‌ నుంచి శ్రీరామ్‌ను సెలెక్ట్ చేసి అతడి తలకి పెయింట్‌ పూసుకోవడం, విచిత్రమైన జ్యూస్‌లు తాగడం లాంటి టాస్కులు ఇచ్చారు. శ్రీరామ్ అన్నింటిని విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్‌కు ఒక పాయింట్‌ లభించింది.

Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక తర్వాతి రౌండ్‌లో హీరోలు.. విలన్స్‌ టీమ్‌లోని రవిని టార్గెట్‌ చేశారు. రవి ధరించిన బట్టలకు పేడ అంటించాలని షన్ను చెప్పాడు. ఆ తర్వాత అన్ని మిక్స్‌ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్‌ చేయాలన్నారు. మరోసారి జ్యూస్‌ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు రవి. చివరి వరకు హీరోస్ టీం ఇచ్చిన టాస్కులన్నీ రవి కష్టంగానే చేశాడు. మరి ఈ రెండు టీమ్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.

Aliya Bhat : జీవితాంతం తండ్రి సంపాదించిన డబ్బును రెండేళ్లలో సంపాదించిన స్టార్ హీరోయిన్

ఒక వైపు టాస్కులు జరుగుతుంటుంటే ఒకే టీంలో ఉన్న ప్రియాంక, సిరిలు తిట్టుకోవడం మొదలు పెట్టి కెప్టెన్ కి ఇద్దరూ కంప్లైంట్ చేసారు. దీంతో షన్ను ఇద్దరిది తప్పు ఉందని చెప్పి ఊరికే అన్నింటికి కంప్లైంట్‌ చేయకు అని సిరి మీద ఫైర్ అయ్యాడు.