Bigg Boss 5: ఏవీ షూట్ స్టార్ట్.. ఆగస్ట్ 20నుంచి క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు!

తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది.. బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇక షోపై చర్చలు, కథనాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 5: ఏవీ షూట్ స్టార్ట్.. ఆగస్ట్ 20నుంచి క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు!

Bigg Boss 5

Bigg Boss 5: తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది.. బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇక షోపై చర్చలు, కథనాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. వీళ్లలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ గడపతొక్కుతారో ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, ప్రస్తుతం ఈ షోకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే షోకు సంబంధించి ప్రోమో షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే అది ప్రసారం కానుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా చర్యలు చేపడుతున్న బిగ్ బాస్ షో నిర్వహకులు.. ఇప్పటికే కంటెస్టెంట్ల అగ్రిమెంట్స్ తదితర పనులను పూర్తిచేశారట. ఇక, మరోవైపు కంటెస్టెంట్ల మీద ఏవీస్ షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది.

గత రెండు రోజులుగా కంటెస్టెంట్ల ఏవీస్ తెరకెక్కిస్తున్న బిగ్ బాస్ టీం ఇప్పటికే యాంకర్ రవి, లోబోలతో పాటు ఆర్టిస్ట్ ప్రియాల ఏవీస్ పూర్తిచేసినట్లు తెలుస్తుండగా ఆగష్టు 15 నాటికి అందరి కంటెస్టెంట్లపై ఏవీస్ పూర్తి చేయనున్నారట. ఆ తర్వాత ఆగష్టు 20 నుండి కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించనున్నట్లు తెలుస్తుంది. కాగా, అందరూ అనుకున్నట్లుగా సారంగదరియా పాటతో మరోసారి ఉర్రూతలూగించిన సింగర్ మంగ్లీ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టడం లేదని తెలుస్తుంది. సారంగదరియా ఫోక్ సింగర్ కోమలి హౌస్ లో ఉండనుందట.

ఫోక్ సింగర్ మంచి పేరున్న కోమలి లవ్ స్టోరీ సారంగదరియా పాటతో మరోసారి తెరమీదకి రాగా ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తుంది. కోమలితో పాటు యాంకర్ రవి, వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, లోబో, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు, టీవీ 9 న్యూస్ రీడర్ ప్రత్యుష ఈ సీజన్ గ్లాస్ హౌస్ లోకి ఎంటర్ కానున్నట్లు తెలుస్తుంది.