Bigg Boss 5 Telegu : అనీ మాస్టర్‌తో జెస్సీ ఫైటింగ్.. రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ..

‘బిగ్ బాస్ 5’ మూడో ఎపిసోడ్‌లో అనీ మాస్టర్ vs జెస్సీ.. ఇంకా కాజల్, లహరిల మధ్య ఫైట్ నడిచింది..

Bigg Boss 5 Telegu : అనీ మాస్టర్‌తో జెస్సీ ఫైటింగ్.. రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ..

Anee Master Fight

Bigg Boss 5 Telegu: కింగ్ నాగార్జున హోస్ట్‌గా స్టార్ మా లో ‘బిగ్ బాస్ 5’ సందడి స్టార్ట్ అయిపోయింది. సాధారణంగా హౌస్‌లో కాంట్రవర్సీలు, కొట్లాటలు ఏ రేంజ్‌‌లో ఉంటాయో తెలిసిందే. ఈసారి ఏకంగా 19 మందిని ఇంట్లోకి పంపారు. ఇక కంటెస్టంట్ల మధ్య మెల్లగా గొడవలు మొదలయ్యాయి. మూడో ఎపిసోడ్‌‌లోని హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

Bigg Boss 5 Telegu Episode 3

కాజల్ ఓవరాక్షన్.. లహరికి సారీ..
ఆర్జే కాజల్.. కిచెన్‌లో పనులు షేర్ చేసుకుందామని హౌస్ మెంబర్స్‌తో హడావిడి చేసింది. దీంతో లహరి కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఎందుకంత హైపర్ అవుతున్నావ్.. నార్మల్‌గా మాట్లాడు కానీ కంటెంట్ క్రియేట్ చెయ్యాలని చూడకు.. చాలా హైడ్రామా చేస్తున్నావ్ అనేసింది. దీంతో కాజల్, లహరికి సారీ చెప్పి, బయటకి వచ్చి ఏడ్చేసింది.

Kajal

విశ్వ ఓదార్చిన యాంకర్ రవి..
ఇంట్లో విశ్వ, యాంకర్ రవిల మధ్య ఎమోషనల్ సంఘటన ఒకటి జరిగింది. లేడీ గెటప్‌లో ఉన్న రవిని ఎత్తుకుని కాసేపు తిప్పాడు విశ్వ. ఆ సమయంలో తన తమ్ముడిని గుర్తు చేసుకుని కంటతడి పెట్టాడు. గతేడాది నా తమ్ముణ్ణి కోల్పోయాను.. రవి నన్ను అన్నా అని పిలుస్తాడు.. నాకోసమే తను ఈ టాస్క్‌కి ఒప్పుకున్నాడు.. అంటూ ఎమోషనల్ అవగా.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ రవి, విశ్వను హత్తుకుని ఓదార్చాడు.

Anee Master

ఇక లోబో, సిరి ఇద్దరు ఒకరినొకరు బాగా తిట్టేసుకుని, చివరకి అదంతా డ్రామా అంటూ అందరికీ కోపం తెప్పించారు. కుర్చీ కోసం జెస్సీ మీద సీరియస్ అయిన అనీ మాస్టర్.. తన బెడ్ దగ్గరకి వెళ్లి ఏడ్చేసింది. దీంతో ఇంట్లో కాసేపు సైలెంట్ వాతావరణం నెలకొంది. బుధవారం ఎపిసోడ్‌లో ఇంకెంత హైడ్రామా జరుగుతుందో చూడాలి.

Bigg Boss 5 Telugu : నాగార్జునతో సహా కంటెస్టంట్స్ రెమ్యునరేషన్ ఎంతంటే..!