Swetha Varma : బిగ్ బాస్ శ్వేతా వర్మకి ఇంత భారీ పారితోషికమా??

తాజాగా బిగ్ బాస్ ఆరోవారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో శ్వేతా వర్మ రెమ్యూనరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. శ్వేతా వర్మ ద రోజ్ విల్లా, ముగ్గురు మొన‌గాళ్లు,

Swetha Varma :  బిగ్ బాస్ శ్వేతా వర్మకి ఇంత భారీ పారితోషికమా??

Swetha Varma

Swetha Varma :  చాలామంది సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్‌ ఒక మంచి సపోర్ట్ గా పని చేస్తుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్ళకి, కెరీర్ ఆరంభంలో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళకి వారానికి ఇంత అని పారితోషకం కూడా ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ పారితోషకం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ కెరీర్ ని బట్టి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి ఈ పారితోషకం ఉంటుంది. బిగ్ బాస్ లో ఎన్ని వారాలు ఉంటే అంత పారితోషకం లెక్కపెట్టి మరీ ఇస్తారు నిర్వాహకులు.

తాజాగా బిగ్ బాస్ ఆరోవారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో శ్వేతా వర్మ రెమ్యూనరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. శ్వేతా వర్మ ద రోజ్ విల్లా, ముగ్గురు మొన‌గాళ్లు, ప‌చ్చీస్‌, సైకిల్, మ్యాడ్ .. లాంటి చిన్న సినిమాల్లో ఒక హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఇటీవల కొన్ని వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది శ్వేతా. ఈమెకి మరీ అంత సెలబ్రిటీ హోదా రాకపోయినా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ లో టాస్కుల్లో బాగా ఆడింది. కంటెస్టెంట్స్ లతో గొడవలు కూడా బాగానే పెట్టుకుంది.

Star Heros : యాంకర్స్ గా మారుతున్న స్టార్ హీరోలు

బిగ్ బాస్ లో శ్వేతవర్మ వారానికి రూ. 60 వేల వరకు తీసుకుందని సమాచారం. ఈ లెక్క‌న ఆమె బిగ్‌బాస్ ద్వారా సుమారు 4 ల‌క్ష‌ల వరకు సంపాదించింది తెలుస్తుంది. ఫాలోయింగ్ తక్కువగా ఉన్న శ్వేతా వర్మకే ఇంత పారితోషకం ఉంటే ఇక షణ్ముఖ్, రవి లాంటి వాళ్ళకి ఎంత ఉంటదో అని లెక్కలు వేసుకుంటున్నారు.