Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. విమర్శలు ఎన్ని ఉన్నా ఈ షోకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు సరి కదా పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ల మీద సీజన్లు..

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

Bigg Boss Telugu Ott

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. విమర్శలు ఎన్ని ఉన్నా ఈ షోకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు సరి కదా పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ల మీద సీజన్లు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి. హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 15 సీజన్ జరుగుతుండగా ఓటీటీ తొలి సీజన్ కూడా పూర్తయింది. ఇక, ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ మొదలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు నాగార్జున అధికారికంగా ప్రకటించగా దానికి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

Arjun Kapoor: బాలీవుడ్‌లో కరోనా కలకలం.. అర్జున్ కపూర్‌కు పాజిటివ్!

మరో రెండు నెలలో మొదలు కానున్న ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ ను ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ సంస్థ అయిన ‘ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిర్వహించనున్నట్లు తెలుస్తుండగా ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రముఖంగా ఓ నలుగురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?

యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్‌ శివ, వర్షిణి, రాజు, వైష్ణవి పేర్లు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోండగా అగ్రిమెంట్స్ కూడా పూర్తయినట్లుగా వినిపిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో షో మొదలు కానుండడంతో మరో వారం పది రోజులలో కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి చేయనున్నట్లు చెప్తున్నారు.