Bangarraju : యాంకర్లుగా మారిన బిగ్‌‍బాస్ భామలు.. నాగార్జున బాగానే సపోర్ట్ చేస్తున్నారుగా..

కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడే అవకాశాల కోసం నాగార్జునని కాకా పట్టారు. అందులో లహరి, కాజల్ కూడా ఉన్నారు. తాజాగా వీరిద్దరికి నాగార్జున పెద్ద అవకాశమే ఇచ్చాడు.

Bangarraju : యాంకర్లుగా మారిన బిగ్‌‍బాస్ భామలు.. నాగార్జున బాగానే సపోర్ట్ చేస్తున్నారుగా..

Lahari Kajal (1)

Bangarraju :   బిగ్‌‍బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి అంతకుముందు అంతగా గుర్తింపు లేకున్నా ఈ షో తర్వాత ఫేమస్ అయిపోతారు. ఈ సారి బిగ్‌‍బాస్ హౌస్ లో పాల్గొన్న లహరి షారి, కాజల్ అంతకుముందు ఎక్కువగా ఎవరికీ తెలీదు. కానీ బిగ్‌‍బాస్ తర్వాత బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. అభిమానుల్ని, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. ఇక బిగ్‌‍బాస్ తర్వాత అవకాశాలు కూడా తెచ్చుకోడానికి బాగా ట్రై చేస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడే అవకాశాల కోసం నాగార్జునని కాకా పట్టారు. అందులో లహరి, కాజల్ కూడా ఉన్నారు.

తాజాగా వీరిద్దరికి నాగార్జున పెద్ద అవకాశమే ఇచ్చాడు. లహరికి ముందుగానే ‘బంగార్రాజు’ టీంని ప్రైవేట్ జెట్ లో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇక నిన్న జరిగిన ‘బంగార్రాజు’ మ్యూజికల్ ఈవెంట్ లో లహరికి, కాజల్ కి యాంకర్ గా అవకాశం ఇచ్చారు. మాములుగా ఇలాంటి ఈవెంట్లకు సుమ లేదా సీనియర్ యాంకర్లు హోస్ట్ చేస్తారు. కానీ నాగార్జున ప్రత్యేకంగా వీళ్ళిద్దర్నీ పిలిపించి అవకాశం ఇచ్చారని సమాచారం.

Chiranjeevi : ‘ఆచార్య’ సినిమా అతని బయోపిక్? అతని పుస్తకం ఆధారంగానే తెరకెక్కుతుందా??

అయితే యాంకర్లుగా వీరిద్దరూ అంతగా మెప్పించలేకపోయారని ప్రేక్షకులు అంటున్నారు. ఎంతైనా సీనియర్ యాంకర్లు చేసిన దాంట్లో సగం కూడా చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. కానీ వీరిద్దరికి ఇలా ఒక పెద్ద ఈవెంట్ ని చేయడం మొదటిసారి కాబట్టి ఫర్వాలేదనిపించారు. మొత్తానికి నాగార్జున సపోర్ట్ తో పెద్ద అవకాశమే దక్కించుకున్నారు. ఇదే సపోర్ట్ తో అక్కినేని ఫ్యామిలీ సినిమాల్లో ఛాన్సులు సంపాదించినా ఆశ్చర్యపోనవసరంలేదు.