RRR: ముంబైలో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సర్వం సిద్ధం!

ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపిస్తున్న ఒక్కటే పేరు ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర ది మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ తర్వాతే ఏదైనా అనేంతగా హైప్ సొంతం..

RRR: ముంబైలో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సర్వం సిద్ధం!

Rrr

RRR: ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపిస్తున్న ఒక్కటే పేరు ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర ది మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ తర్వాతే ఏదైనా అనేంతగా హైప్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. సినిమా అంచనాలను ఇంకా ఇంకా పెంచేలా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ తో సిద్ధం అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ కే రాజమౌళి అన్ని భాషల్లో ప్రెస్ మీట్ లు పెట్టిన సంగతి తెలిసిందే.

RRR

RRR

Pooja Hegde : వరుస బికినీ ఫొటోలతో హీటేక్కిస్తున్న బుట్టబొమ్మ

కాగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సమయం ఆసన్నమైంది. ముందుగా ముంబైలో ఈవెంట్స్ ప్లాన్ చేసిన మేకర్స్ అక్కడ బ్లాస్టింగ్ ఎపిసోడ్ కి సర్వం సిద్ధం చేశారు. ఈ ఆదివారం మొదలుకానున్న తొలి ప్రమోషన్ ఈవెంట్ కి కనీవినీ ఎరుగని రీతిలో ఈవెంట్ బ్లాస్ట్ కి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా ఎప్పటికప్పుడు యూనిట్ సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూనే ఉంది. భారీ సెట్టింగ్స్ తో గతంలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు జరగని విధంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.

 

RRR

RRR

Jeevitha on MAA: ‘మా’లో.. మళ్లీ అదే జరుగుతోంది!

సూపర్ డూపర్ ఈ బ్లాస్టింగ్ ఎపిసోడ్ ను చాలా స్పెషల్ గా మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా మంచి మంచి హంగులతోనే ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు, స్టార్స్ హాజరుకానున్న ఈ ఈవెంట్ నెవెర్ బిఫోర్ అనేలా ఉండేందుకు స్వయంగా రాజమౌళి, తారక్, చరణ్ రంగంలోకి దిగి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ లో చరణ్, తారక్ లైవ్ పర్ఫామెన్స్ కూడా ఉండే అవకాశం ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది ఈ సాయంత్రం చూడాలి.