RRR: బ్లాస్టింగ్ అప్డేట్.. డిసెంబర్ 9న ట్రైలర్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయి సినిమా.. అందునా తారక్, రామ్ చరణ్ లాంటి సాలిడ్ హీరోలు.. చరిత్రను టచ్ చేసే సినిమా..

RRR: బ్లాస్టింగ్ అప్డేట్.. డిసెంబర్ 9న ట్రైలర్!

Rrr

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయి సినిమా.. అందునా తారక్, రామ్ చరణ్ లాంటి సాలిడ్ హీరోలు.. చరిత్రను టచ్ చేసే సినిమా.. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తీసుకొచ్చిన నటీనటులు.. ఇదో ఇంటర్నేషనల్ ప్యాకేజీగా మార్చేసి ఆర్ఆర్ఆర్ అంచనాలను ఆకాశానికి పెంచేశాడు జక్కన్న. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Shama Sikander: షామా హొయలు.. ఊపేస్తున్న హాట్ బ్యూటీ!

కాగా.. సినిమా ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ముందుగా ట్రైలర్ తో ప్రమోషన్ తో పాటు ఆర్ఆర్ఆర్ రచ్చ మొదలు పెట్టాలని చూస్తున్న జక్కన్న అందుకు ముహూర్తం కూడా పెట్టేసినట్లు ప్రకటించాడు. ఈనెల 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లుగా రాజమౌళి ట్విట్టర్ లో ప్రకటించాడు. ముందుగా డిసెంబర్ 3 ట్రైలర్ విడుదల చేయాలని అనుకున్నా సిరివెన్నెల ఆకస్మిక మరణంతో ఇది వాయిదా పడింది.

Akhanda Bulls: అఖండకే హైలెట్ ఈ గిత్తలు.. కృష్ణార్జునుల ప్రత్యేకతలివే!

కాగా.. ఇప్పుడు ట్రైలర్ కోసం మరో ముహూర్తం పెట్టేశారు. జనవరి 7 సినిమా అంటే సరిగ్గా ట్రైలర్ తరవాత 28 రోజులు కౌంట్ డౌన్ మొదలు కానుంది. ఈ నెల రోజులు సినిమా ప్రచారం హోరెత్తించనున్నారు. మిగతా పాటలతో పాటు నేషనల్ లెవల్ లో మేకర్స్ ఇంటర్వూలు కూడా ప్లాన్ చేయనున్నారు. ముందుగా ఈ ట్రైలర్ ఎంత రచ్చ చేయనుందోనని ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు చర్చలు కూడా మొదలు పెట్టారు.