NTR 30: బాలీవుడ్ బ్యూటీలు కాదు.. సామ్‌ను లాక్ చేసిన కొరటాల?

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ కోసం సినీ అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా..

NTR 30: బాలీవుడ్ బ్యూటీలు కాదు.. సామ్‌ను లాక్ చేసిన కొరటాల?

Ntr 30

NTR 30: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ కోసం సినీ అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేయలేనంతగా పెరిగి పోతుందని టాక్ నడుస్తుంది. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ స్టార్ హీరోలు చేయబోయే సినిమాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Singer Revanth: పెళ్లి కొడుకైన సింగర్ రేవంత్.. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలు అలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ల పేర్లు వినిపిస్తూ వస్తుండగా ఇప్పుడు మరో పేరు ఫైనల్ అయిందని మరో టాక్ మొదలైంది. డైవర్స్ తర్వాత అటు బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు గ్రాండ్ ప్లాన్ చేసుకున్న సమంతాను ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లుగా వినిపిస్తుంది. కథలో హీరోయిన్ పాత్ర బలంగా ఉంటుందని.. సామ్ అయితే ఆ పాత్రను క్యారీ చేయగలడని దర్శకుడు కొరటాల బలంగా నమ్ముతున్నాడట.

AP Movie Theaters: ఆగని అధికారుల దాడులు.. థియేటర్ల మూసివేత!

అందుకే, ఎన్టీఆర్ ముప్పైవ సినిమాగా.. కొరటాలతో రెండవ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ కోసం సమంతాను ఫైనల్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. కాగా.. సమంతా ఇప్పటికే ఎన్టీఆర్ తో బృందావనం, రామయ్య వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ సినిమాలలో నటించగా అందులో రెండు హిట్టు.. మరో రెండు ఫట్టు. ఇప్పుడిది ఈ కాంబినేషన్ లో ఐదవ సినిమా అవుతుంది. సమంతను ఫైనల్ చేయడం నిజమైతే.. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.