Bigg Boss 5 : బిగ్ బాస్ శ్రీరామచంద్ర కోసం మొన్న హీరోయిన్.. ఇవాళ బాలీవుడ్ కమెడియన్

శ్రీరామచంద్ర కోసం ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. సింగర్‌ శ్రీరామచంద్ర తెలుగువాడే అయినా హిందీలో ఇండియన్‌ ఐడల్‌ షో విన్నర్‌గా నిలిచి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Bigg Boss 5 : బిగ్ బాస్ శ్రీరామచంద్ర కోసం మొన్న హీరోయిన్.. ఇవాళ బాలీవుడ్ కమెడియన్

Sriram

Bigg Boss 5 :  తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్ 19 మందితో మొదలైంది. ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. రోజు రోజుకి బిగ్ బాస్ గొడవలతో, ఎమోషనల్ గా మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇక కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉంటే ఎలిమినేట్ అవ్వకుండా ఉండేందుకు తమకి ఓటు వేయాలి అని ప్రమోషన్స్ చేస్తారు. వేరే సెలెబ్రిటీలు కూడా తమకి కావాల్సిన వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి అంటూ ప్రమోట్ చేస్తారు. ఇలా చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ కోసం ప్రమోషన్ చేస్తారు. ఈ సారి ఎనిమిదవ వారం రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌ నామినేషన్స్‌లో ఉన్నారు.

Bigg Boss 5 : ఎవడిక్కావాల్రా నీ సారీ.. ఒకరిపై ఒకరు ఫైర్ అయిన షన్ను సిరి

ఇందులో శ్రీరామచంద్ర కోసం ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. సింగర్‌ శ్రీరామచంద్ర తెలుగువాడే అయినా హిందీలో ఇండియన్‌ ఐడల్‌ షో విన్నర్‌గా నిలిచి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ శ్రీరామచంద్ర నాకు మంచి ఫ్రెండ్ అతను బిగ్ బాస్ లో బాగా ఆడుతున్నాడు. అతనికి సపోర్ట్ చేస్తూ ఓటు వేయండి అంటూ ఓ వీడియోని షేర్ చేసింది. తాజాగా మరో సెలబ్రిటీ శ్రీరామచంద్రకి సపోర్ట్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసింది.

Bigg Boss 5 : నా వల్ల కాదు.. నేను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతా

శ్రీరామ్‌ కోసం బాలీవుడ్ పాపులర్‌ కమెడియన్‌ / యాంకర్ భారతీ సింగ్ ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో నా ఫ్రెండ్‌ శ్రీరామచంద్ర తెలుగు బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్నాడు. అతడికి నా బెస్ట్‌ విషెస్‌ తెలుపుతున్నాను. దయచేసి అందరూ శ్రీరామ్‌కే ఓటేయండి అని తెలిపింది. ఈ వీడియో చూసిన శ్రీరామ్‌ అభిమానులు దాన్ని షేర్ చేస్తూ అతడికి సపోర్ట్‌ చేసినందుకు భారతీ సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.