83 Movie: 83 సినిమాపై బాలీవుడ్ కాన్ఫిడెంట్.. టీమ్ ఇండియాకు ప్రీమియర్ షో!

ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ చేశారో.. 83 సినిమా కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న 83 సినిమా ఈ క్రిస్ మస్ కి గ్రాండ్..

83 Movie: 83 సినిమాపై బాలీవుడ్ కాన్ఫిడెంట్.. టీమ్ ఇండియాకు ప్రీమియర్ షో!

83 Movie

83 Movie: ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ చేశారో.. 83 సినిమా కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న 83 సినిమా ఈ క్రిస్ మస్ కి గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే చాలా స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్ లో వచ్చినా.. ఈ 83 మూవీ మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ అంటున్నారు ప్రీమియర్ సినిమా చూసిన స్టార్లు. ఒక్క వరల్డ్ కప్ తో ఇండియా క్రేజ్ ని, క్రికెట్ ని మార్చేసిన 1983 క్రికెట్ టీమ్.. వరల్డ్ కప్ ఎలా సాధించారు..? హేమాహేమీలున్న టీమ్స్ తో పోరాడి ఇండియా వరల్డ్ కప్ ఎలా గెలుచుకుందో.. పాయింట్ టూ పాయింట్ చిన్న డీటెయిల్డ్ తో సహా చూపించారు 83 సినిమాలో.

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

రణవీర్ సింగ్ కపిల్ దేవ్ గా.. దీపికా పడుకోన్ భార్యగా నటిస్తున్న 83 మూవీ లేటెస్ట్ గా జరిగిన ప్రీమియర్ తో సందడి చేసింది. స్పెషల్లీ దీపికా, రణవీర్ అయితే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో అందరినీ ఎట్రాక్ట్ చేశారు. 83 మూవీ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ డిసెంబర్ 24న ధియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రీమియర్స్ లో సందడి చేశారు స్టార్లు. వెటరన్ టీమ్ ఇండియా మెంబర్స్ తో పాటు.. సినిమా యూనిట్, బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అందరూ ప్రీమియర్ కి అటెండ్ అయ్యి.. పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు సినిమా హిట్ అవుతుందంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ

ఇండియన్స్ కి క్రికెట్ అంటే గేమ్ కాదు.. ఎమోషన్. అయితే దాదాపు 38 ఏళ్ల క్రితం 1983లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లి వరల్డ్ కప్ సాధించింది ఇండియా. అప్పటి బెస్ట్ మూమెంట్స్ ని కళ్లకు కట్టినట్టు.. ఎలా రిక్రియేట్ చేశారో చూపించడానికి డిసెంబర్ 24న పాన్ ఇండియా వైడ్ గా వచ్చేసింది. ఈ 83 మూవీ స్పోర్ట్స్ డ్రామా అయినా.. అంతకుమించిన ఇండియన్స్ ఎమోషన్స్ ని సినిమాలో యాడ్ చేశారు కబీర్ ఖాన్. కమర్షియల్ కంటెంట్ తో పాటు ఎమోషన్స్ తో ప్యాక్ చేసిన ఈ సినిమా హిట్ గ్యారంటీ అంటున్నారు ఫాన్స్.