Skanda : బోయపాటి రామ్ మాస్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జరిగినట్టు ప్రకటించి, సినిమాని 15 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

Skanda : బోయపాటి రామ్ మాస్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

Boyapati Ram Pothineni Movie Title announced

Boyapati Rapo :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ వైరల్ అయింది. రామ్ లుక్ మార్చేసి మరింత మాస్ గా తయారయ్యాడు ఈ సినిమా కోసం.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జరిగినట్టు ప్రకటించి, సినిమాని 15 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

Theatrical Releases : ఈ వారం థియేటర్స్‌లో రిలీజయ్యే తెలుగు సినిమాలు..

బోయపాటి రామ్ మాస్ సినిమాకు ‘స్కంధ’ అనే టైటిల్ ని ప్రకటించారు. కింద సబ్ టైటిల్ ది అటాకర్ అని ఇచ్చారు. స్కంధ అంటే కుమారస్వామి అని అర్ధం వస్తుంది. కుమారస్వామి దేవతలకు సైన్యాధిపతిగా ఉండి యుద్ధాలను గెలిపిస్తాడు అని పురాణాల్లో ఉంటుంది. ఈ సినిమాలో రామ్ కూడా కుమారస్వామిలాగా ఎవరికోసం అయినా యుద్ధం చేస్తూ ఉంటాడేమో అని తెలుస్తుంది. ఇక బోయపాటి సినిమా అంటే ఏ రేంజ్ మాస్ ఉంటుందో తెలిసిందే. దానికి రామ్ ఎనర్జీ తోడైతే ఇంకే లెవల్లో ఉంటుందో చూడాలి.