Bheemla Nayak : భీమ్లాలో బ్రహ్మానందం..
తన నెక్స్ట్ సినిమాల గురించి తెలియచేశారు బ్రహ్మానందం. కృష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న రంగమార్తాండ, శర్వానంద్, నితిన్ సినిమాలు వాటితో పాటు 'భీమ్లానాయక్' సినిమాలో కూడా.....
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ‘భీమ్లానాయక్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
TV Actress Lahari: బైక్‌ను ఢీకొట్టిన సీరియల్ నటిలహరి
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ సాంగ్స్, టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరో హీరోయిన్స్ పాత్రలని మాత్రమే రివీల్ చేసారు. తాజాగా మరో లెజండరీ యాక్టర్ కూడా ఈ సినిమాలో ఉన్నారని తెలిసింది. చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆ నటుడే స్వయంగా ‘భీమ్లానాయక్’లో చేస్తున్నాను అని తెలియచేసారు. ఆ లెజెండరీ యాక్టర్ మరెవరో కాదు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.
Shannu Deepu : షన్ను-దీపు పెళ్ళికి మాకు ఓకే.. కానీ ఒక్క కండిషన్ : షణ్ముఖ్ పేరెంట్స్
బ్రహ్మానందం ఇటీవల ఆలీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’కు వచ్చారు. ఈ షోలో చాలా విషయాలు తెలియచేశారు. అందులో భాగంగానే త్వరలో చేస్తున్న సినిమాల గురించి కూడా చెప్పారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మానందం ఇటీవల మళ్ళీ మెల్లిమెల్లిగా సినిమాలు చేస్తున్నారు. ఈ షోలో తన నెక్స్ట్ సినిమాల గురించి తెలియచేశారు బ్రహ్మానందం. కృష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న రంగమార్తాండ, శర్వానంద్, నితిన్ సినిమాలు వాటితో పాటు ‘భీమ్లానాయక్’ సినిమాలో కూడా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు బ్రహ్మి ఈజ్ బ్యాక్ అంటూ ఆనందపడుతున్నారు.
Sara Tendulkar : హీరోయిన్స్‌కి ఏ మాత్రం తీసిపోని సచిన్ కూతురు
గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి జల్సా, పంజా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్.. లాంటి మరెన్నో సినిమాల్లో అద్భుతమైన కామెడీ పండించారు. మరి ‘భీమ్లానాయక్’ సినిమాలో బ్రహ్మానందం ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సారి ఎంత కామెడీ పండిస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.