Viral Video: పెళ్లికూతురు ప్రశ్న- పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావు? పెళ్లికొడుకు సమాధానంతో అమ్మాయి షాక్!

మనం సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వైరల్ వీడియోలను చూస్తూ ఉంటాం.. అటువంటిదే ఇది కూడా!

Viral Video: పెళ్లికూతురు ప్రశ్న- పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావు? పెళ్లికొడుకు సమాధానంతో అమ్మాయి షాక్!

Bride

Viral Video: మనం సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వైరల్ వీడియోలను చూస్తూ ఉంటాం.. వధూవరుల చిలిపి ప్రశ్నలు, సమాధానాలు మనకు ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తూ ఉంటాయి. ఇటీవల బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేయగా.. ఎలా వైరల్ అయ్యిందో చూశాం కదా? ఇప్పుడు మరో పెళ్లిలో వరుడు చెప్పిన చిలిపి సమాధానం వైరల్‌గా మారింది.

అసలు ఈ వీడియోలో ఏముంది అంటే, పెళ్లికి ముందు వధువు వరుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది. అబ్బాయి చెప్పిన సమాధానం విని పెళ్లికూతురు సహా అక్కడున్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇంతగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లికొడకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, పెళ్లికి ముందు వధూవరులు ముఖాముఖి కూర్చోవడం కనిపిస్తుంది. వారి చుట్టూ చాలా మంది కూడా కూర్చున్నారు. వివాహానికి ముందు కార్యక్రమంలో వధువు వరుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని అడిగింది. “నాకు ప్రశాంతత అక్కర్లేదు” అంటూ ఆ కుర్రాడు వెంటనే సమాధానం ఇచ్చాడు. అబ్బాయి సమాధానం విని పెళ్లికూతురు షాక్ అయ్యింది.

Omicron Effect: ముందు జాగ్రత్త.. జనవరి 5వ తేదీ వరకు అమల్లోకి 144సెక్షన్!

అయితే, నవ్వుకుంటూ కాస్త చిలిపి కోపం ప్రదర్శించింది పెళ్లికూతురు. ఈ సమాధానం విని అక్కడ కూర్చున్న వారు నవ్వేశారు. అబ్బాయి కూడా పకపకా నవ్వేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.. షేర్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by The Wedding Brigade (@theweddingbrigade)