Bro First Single My Dear Markandeya : రెడీగా ఉండండి.. బ్రో నుంచి ఫస్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్..
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బ్రో(Bro).
![Bro First Single My Dear Markandeya : రెడీగా ఉండండి.. బ్రో నుంచి ఫస్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్.. Bro First Single My Dear Markandeya : రెడీగా ఉండండి.. బ్రో నుంచి ఫస్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్..](https://10tv.in/wp-content/uploads/2023/07/Bro-First-Single.jpg)
Bro First Single
Bro First Single : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బ్రో(Bro). సముద్ర ఖని (Samuthirakani) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం (Vinodaya Sitham) కి రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇప్పటికే సినిమా షూటింగ్ పూరైంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ సినిమా నుంచి పాటలను ఒక్కొక్కటి విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే పాట ప్రొమోను రేపు(జూలై 8 శనివారం) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Nayakudu Trailer : మహేశ్ బాబు విడుదల చేసిన నాయకుడు ట్రైలర్ చూశారా..?
మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోవడంతో మ్యూజిక్ ఆల్భమ్పై మంచి అంచనాలే ఉన్నాయి. మరీ థమన్ ఏ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడో చూడాల్సిందే. ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా నటిస్తోండగా ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం.