Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

తండ్రీ కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. మరి తండ్రి లక్కీ నంబర్ కవితను ఈ కేసునుంచి బయటపడేస్తుందా?

Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam MLC kavitha

Delhi Liquor Scam MLC kavitha : సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్ ‘6’ అనే విషయం తెలిసిందే. తండ్రీ,సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు హాజరవ్వటానికి హాజరయ్యారు. కవితవెంట ‘6’ కార్ల కాన్వాయ్ ఉంది. అలాగే కవిత 6666 నంబర్ గల కారులోనే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ‘6’ నంబర్ కవిత తండ్రి,సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ అనే విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుకున్న కవిత దిగ్విజయంగా విచారణ పూర్తి చేసుకుని సురక్షితంగా బయటకు రావాలనే ఆలోచనతు ఇలా ‘6’ నంబర్ తోనే కవిత ఈడీ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇదంతా సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం ప్రకారమే జరుగుతోందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తన లక్కీ నంబర్ ‘6’ తన కుమార్తెపై వచ్చిన ఈ ఆరోపణలు తుడిచిపెట్టేస్తుందనే నమ్మకం కావచ్చు. అలా కవిత ‘6’ కార్ల కాన్వాయ్ లో 6666 నంబర్ గలకారులు ఈడీ విచారణకు హాజరయ్యేలా ప్లాన్ జరిగినట్లుగా అనుకోవచ్చు.

కాగా..సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్ ‘6’ అనే విషయం తెలిసిందే. కేసీఆర్..ఆయన ఏ ముఖ్య కార్యక్రమాలు చేసినా ఈ ‘6’నంబర్ ఉండాల్సిందే. కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకూ ఆయన ప్రస్థానంలో ‘6’తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వాహనం నంబర్,సెల్‌ఫోన్ నంబర్.. ఇలా ప్రతీది ఆరుతో ముడిపడి ఉండేలా చూసుకుంటారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ మొదటిసారి గెలిచాక ‘6‘ నెలలోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీబాధ్యతలు చేపట్టారు. 2018,డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమసయంలో కూడా కేసీఆర్ ‘6’ నంబర్ నే కొనసాగించారు. డిసెంబర్ 6వ తేదీనే అసెంబ్లీని రద్దును ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ జీవితంలో ఆరు సెంటిమెంట్ ప్రతీ చోటా..ప్రతీ సందర్భం..ప్రతీ ఘట్టంలోనే కనిపిస్తుంది.

ఎన్నో వివాదాలు వెల్లువెత్తినా పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించిన కేసీఆర్ ఇక్కడ కూడా తన లక్కీ నంబర్ ‘6’ నే కొనసాగించారు. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతీ అంశంలో తన లక్కీ నంబర్ ‘6’ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం,6 కాన్ఫరెన్స్ హాళ్లు,6 డైనింగ్ హాళ్లు,6 పార్కులు,60 మీ. గుమ్మటం,60ఫీట్ల రోడ్డు..’ ఇలా కొత్త సచివాలయం డిజైన్‌లో అన్నింటా ‘6’ ప్రత్యేకత ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ప్రస్థానంలో..ఆయన విజయాల్లో ఇంతగా పెనవేసుకుని పోయి ముందుకు నడిస్తున్న ఈ ‘6’ నంబర్ కుమార్తె కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పిస్తుందా? ఆమెపై వచ్చినవి కేవలం ఆరోపణలే కాదు నిజాలుకావని నిరూపిస్తుందా? అనేది వేచి చూడాలి. మరి తండ్రి లక్కీ నంబర్ ‘6’ కవితకు కూడా లక్కీ అవుతుందా? అనేది వేచి చూడాలి…