Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

ఇప్పటి వరకూ సూటు, బూటు వేసుకుని స్టైలిష్ స్టార్ గా కనిపించిన అల్లు అర్జున్ కి ఈ ట్యాగ్ అంతగా సూట్ కాదేమో. అప్పుడప్పుడు మాస్ సినిమాలు చేసినా.. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్..

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

Pushpa

Pushpa: ఇప్పటి వరకూ సూటు, బూటు వేసుకుని స్టైలిష్ స్టార్ గా కనిపించిన అల్లు అర్జున్ కి ఈ ట్యాగ్ అంతగా సూట్ కాదేమో. అప్పుడప్పుడు మాస్ సినిమాలు చేసినా.. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్, ఊరమాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న పుష్ప ముందు ఏ సినిమా అయినా బలాదూరే. మరి కంప్లీట్ మాస్ యాక్షన్ తో బన్నీ ఫ్యాన్స్ ని ఎలా ఎంగేజ్ చెయ్యబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.

Bigg Boss 5: హౌస్‌లో ఏం జరుగుతుంది.. సిరి, షణ్ముఖ్‌లను కడిగేసిన నాగ్!

పుష్ప దూకుడు మామూలుగా లేదు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీపై తగ్గేదే లేదంటున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబందించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే క్రేజీ సాంగ్ తో కంప్లీట్ మాస్ లుక్ లో బన్నీ తనలోని మరో ఊరమాస్ యాంగిల్ ని చూపించాడు. డాన్ సాంగ్ లో సూపర్ ఊరమాస్ లుక్ తో ఫ్యాన్స్ కి సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

Sidhika Sharma: సిద్ధికా ఈజ్ వెరీ హాట్ స్వీట్!

బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీగా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న పుష్ప రోజురోజుకీ అంచనాలు పెంచేస్తోంది. కెరీర్లో అల్లు అర్జున్ స్టైలిష్ క్యారెక్టర్లతోనే ఎక్కువగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ మాస్, ఊరమాస్ క్యారెక్టర్లో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. బన్నీ సినిమాలు కమర్షియల్ గా ఎంత స్టైలిష్ గా ఉన్నా.. బన్నీ బాడీలో మాస్ ఎలిమెంట్స్ తో సినిమాకి మాస్ టచ్ ఇస్తాడు బన్నీ.

Aditi Rao Hydari: లేలేత అందాలతో అదరగొడుతున్న అదితి!

కానీ పుష్ప సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ ఊరమాస్ లుక్ తో రిలీజ్ అవుతోంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీగా డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న పుష్పలో బన్నీ ఈసారి క్యారెక్టర్ తో పాటు డ్రెస్సింగ్, హెయిర్, డైలాగ్స్ అన్నీ కంప్లీట్ ఊరమాస్ గా మార్చేసుకున్నాడు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక బన్నీకి జంటగా నటిస్తోంది. బన్నీయే కాదు.. సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారక్టర్ కంప్లీట్ మాసీనెస్ ని ఓన్ చేసుకుని ఊరమాస్ గా కనిపిస్తున్నారు.