Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ రాజా ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుందని, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ వీడియోలో మనం చూశాం.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ రాజా ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?

Buzz On Raviteja Screen Presence In Waltair Veerayya Goes Viral

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుందని, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ వీడియోలో మనం చూశాం. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో బాస్‌ను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya : “చిరంజీవి-శ్రీదేవి” వచ్చేశారు.. వాల్తేరు వీరయ్య సెకండ్ సింగల్ రిలీజ్..

ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినప్పట్నుంచి ఈ మూవీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల ఆయన పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియో ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ACP విక్రమ్ సాగర్‌గా రవితేజ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో మాస్ రాజా ఎంతసేపు కనిపిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Waltair Veerayya: వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య.. తగ్గేదే లే అంటోన్న సీనియర్స్!

కాగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ 40 నుంచి 45 నిమిషాల పాటు వెండితెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఇందులో ఎక్కువగా చిరంజీవితో కీలకమైన సీన్స్‌లోనే మాస్ రాజా కనిపిస్తాడని తెలియడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు మాస్ రాజా ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.