Food Poisoning : వర్షాకాలంలో కలుషిత ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుందా!

వర్షకాలంలో సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కలరా , క్లోస్ట్రిడియం డిఫెసిల్ , స్టాఫైలోకోకస్ ఆరియస్, వైరస్లలో నోరో వైరస్ లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల ఉన్నప్పుడు ఆహారానికి బ్యాక్టీరియా, వైరస్ లకు ఆలవాలంగా మారతాయి.

Food Poisoning : వర్షాకాలంలో కలుషిత ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుందా!

Food Poisoning : కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తాగటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ గా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా వర్షకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఎందుకంటే నిల్వ ఉన్న , అపరిశుభ్రమైన నీటితో తయారు చేసిన ఆహార పదార్ధాలను తినటం, కలుషితమైన నీటిని తాగటం వల్ల చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు మరియు శిశువులు మరియు దీర్ఘకాలిక సమ్యలైన మధుమేహం, ఎయిడ్స్, కాలేయ వ్యాధి తో బాధపడుతున్నవారు ఫుడ్ పాయిజనింగ్ సమస్యను ఎదుర్కొటున్నారు. కొంతమంది దీని వల్ల ప్రాణాపాయ స్ధితికి చేరుతున్నారు.

వర్షకాలంలో సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కలరా , క్లోస్ట్రిడియం డిఫెసిల్ , స్టాఫైలోకోకస్ ఆరియస్, వైరస్లలో నోరో వైరస్ లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల ఉన్నప్పుడు ఆహారానికి బ్యాక్టీరియా, వైరస్ లకు ఆలవాలంగా మారతాయి. బ్యాక్టీరియాల కారణంగా ఫుడ్ పోయిజనింగ్ కు దారితీసి విరేచనాలు, జ్వరం,వాంతులు,కడుపు నొప్పి,ఆకలి తగ్గుదల వంటి సమస్యలు కలుగుతాయి.

చాలా మందిలో ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎలాంటి చికిత్స లేకుండానే తగ్గుతుంది. అయితే కొందరిలో మాత్రం విరేచనాలు, వాంతులు తీవ్రమై నిర్జలీకరణ పరిస్ధితి ఏర్పడుతుంది. అలాంటి వారికి ఓఆర్ ఎస్ వంటి ద్రావణాలను అందించాలి. అందకూడ అందుబాటులో లేకుంటే నీరు, ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగించాలి. చాలా శాతం బాక్టీరియా ద్వారా కలిగే ఫుడ్ పాయిజనింగ్‌లకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌లకు యాంటీబయాటిక్ చికిత్స అవసరం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఆల్కహాల్ మరియు కెఫిన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ద్రవపదార్ధాలను తీసుకోవాలి. మసాలాలు, కారం ఎక్కువగా లేని ఆహారాన్నితీసుకోవాలి.

సమస్య ఏమాత్రం తీవ్రంగా ఉన్నట్లు అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.