Rajasekhar : జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు.. మోసం చేశారంటూ నిర్మాత వ్యాఖ్యలు..

జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ.. ''రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమయంలో మేము ఆయనతో గరుడవేగ సినిమా తీశాం. రాజశేఖర్ తమ..................

Rajasekhar : జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు.. మోసం చేశారంటూ నిర్మాత వ్యాఖ్యలు..

Jeevitha

Rajasekhar :   టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, అతని భార్య జీవితలపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాక వారిపై కేసు నమోదు చేశారు. రాజశేఖర్ తో PSV గరుడవేగ సినిమా నిర్మించిన జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై మీడియాతో మాట్లాడారు.

జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ మాట్లాడుతూ.. ”జీవిత, రాజశేఖర్ చాలా మంచి మనుషులుగా బయటి ప్రపంచంలో చలామణి అవుతున్నారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ వల్ల మేము వారికి పరిచయం అయ్యాం. రాజశేఖర్, జీవితల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం” అని అన్నారు.

Ante Sundaraniki : ట్విట్టర్ వేదికగా కన్నడ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన నాని

జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ.. ”రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమయంలో మేము ఆయనతో గరుడవేగ సినిమా తీశాం. రాజశేఖర్ తమ ఆస్తులను మా వద్ద తాకట్టు పెట్టి 26 కోట్లు రూపాయలు అప్పు తీసుకున్నారు. మా వద్ద ప్రాపర్టీ పెట్టి మమ్మల్ని మోసం చేశారు. తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా ఎస్పి రాజశేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. సినిమాకు మేము డబ్బు పెడితే సంజయ్ రామ్ కు మా సినిమాను అమ్మేశాడు. త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడు. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి. అవకాశం కోసం జీవిత, రాజశేఖర్ మమ్మల్ని వాడుకున్నారు. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. చెక్ బౌన్స్ అయిన కేసులో
నగిరిలో జీవిత,రాజశేఖర్ పై కేసు నమోదు చేశారు” అని తెలిపారు.