CCL : సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేస్తుంది.. హీరోలు స్టేడియంలో బ్యాట్ పట్టుకుంటే..
తాజాగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రాబోతుంది. ఏ సారి ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ సెలబ్రిటీ లీగ్ ఆడబోతున్నాయి..............
CCL : మన దేశంలో సినిమా, క్రికెట్ ఈ రెండూ చాలా మందికి పిచ్చి. ఈ రెండిట్లో ఉండేవాళ్ళకి అభిమానులు కూడా విపరీతంగా ఉంటారు. సినిమా అన్నా, క్రికెట్ అన్నా చూడటానికి అంతా ఎదురుచూస్తారు. అలాంటిది సినిమా వాళ్లు క్రికెట్ ఆడితే ఇక ఆ రేంజ్ వేరు. మన హీరోలు బ్యాట్ పట్టుకొని స్టేడియం లో ఆడుతుంటే అటు సినిమా, ఇటు క్రికెట్ అభిమానులు అంతా కలిసి సందడి చేస్తారు. గతంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో అన్ని పరిశ్రమల వాళ్ళ మధ్య క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ సెలెబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లు జరగట్లేదు.
తాజాగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రాబోతుంది. ఏ సారి ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ సెలబ్రిటీ లీగ్ ఆడబోతున్నాయి. తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబాంగ్స్, కేరళ స్త్రీకార్స్, ముంబై హీరోస్, చెన్నై థండర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ పేర్లతో ఎనిమిది టీంలు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొనబోతున్నాయి. ఈ మ్యాచుల్లో ఆయా పరిశ్రమలకి చెందిన హీరోలు, నటులు క్రికెట్ ఆడి అలరించనున్నారు.
ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమవుతుంది. లీగ్ మ్యాచ్ లు లక్నో, జైపూర్, బెంగుళూరు, జోధ్ పూర్, త్రివేండ్రంలో జరగనున్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లు మాత్రం హైదరాబాద్ లో జరగనున్నాయి. దీంతో అన్ని సినీ పరిశ్రమల ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ మ్యాచ్ లలో పాల్గొంటారు.
Pathaan : బాహుబలి 2, KGF 2ల ఆ రికార్డుని పఠాన్ నాలుగు రోజుల్లోనే కొట్టేసింది..
మన తెలుగులో అఖిల్, సచిన్ జోషి, ఆదర్శ్, తమన్, తరుణ్, సుధీర్ బాబు.. లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. మరి ఈ సారి కొత్తగా ఇంకెవరు మన జట్టులో యాడ్ అవుతారో చూడాలి. హీరోయిన్స్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొని అందరికి జోష్ నింపుతారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరగబోతుంది అని ప్రకటించడంతో ఇప్పట్నుంచే టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారు అభిమానులు. సినీ, క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back.
Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H
— CCL (@ccl) January 28, 2023
CELEBRITY CRICKET LEAGUE IS BACK… The biggest sportainment property – #CelebrityCricketLeague [#CCL] – that brings together actors from 8 film industries to cricket field is back… #CCL2023 starts 18 Feb 2023. #HappyHappyCCL pic.twitter.com/7prQLgPsjG
— taran adarsh (@taran_adarsh) January 28, 2023