Mega154: చిరు లీక్స్.. వాల్తేరు వీరయ్య కన్ఫం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ నిన్న(ఏప్రిల్ 29) రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగాఫ్యాన్స్....

Mega154: చిరు లీక్స్.. వాల్తేరు వీరయ్య కన్ఫం!

Chiranjeevi Leaks 154 Movie Title Valteru Veeraiah

Mega154: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ నిన్న(ఏప్రిల్ 29) రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగాఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ స్వింగ్‌లో పాల్గొని ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి నోరుజారేశాడు. గతంలోనూ ఆచార్య సినిమా టైటిల్‌ను అందరికంటే ముందర చెప్పేసి అందరికీ షాకిచ్చాడు.

Acharya : ‘ఆచార్య’ డే1 కలెక్షన్స్..

ఇప్పుడు మరోసారి చిరు నటించబోయే తన నెక్ట్స్ సినిమా టైటిల్‌ను కూడా రివీల్ చేశాడు. యంగ్ డైరెక్టర్స్‌తో ఆచార్య సినిమా గురించి మాట్లాడుతున్న క్రమంలో బాబీ డైరెక్షన్‌లో చిరు చేయబోయే 154 చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా కోసం బాబీ చెప్పిన కథ, అతడు చెప్పిన విధానం తనకు బాగా కనెక్ట్ అయ్యాయని.. అందుకే వాల్తేరు వీరయ్య సినిమాను ఓకే చేశానంటూ నోరుజారాడు చిరు. ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

Mega154: చిరుతో మాస్ రాజా హైస్పీడ్ షూటింగ్!

దీంతో మరోసారి చిరు లీక్స్ ద్వారానే చిరు 154వ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ అయ్యింది. చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలా చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తానే రివీల్ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా చిరు తన సినిమాల గురించిన లీకులను బయటపెట్టకుండా ఉంటే మంచిదని వారు కోరుతున్నారు. ఏదేమైనా బాబీ డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న సినిమా పేరు ఆయన నోటివెంట రావడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.