Chiranjeevi: ఇక అవి చాలంటోన్న మెగాస్టార్.. ఒరిజినాలిటీ కోసమేనట!

మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాన్ని ఓ యంగ్ డైరెక్టర్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను రీమేక్ మూవీగా కాకుండా స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందించేందుకు చిరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi: ఇక అవి చాలంటోన్న మెగాస్టార్.. ఒరిజినాలిటీ కోసమేనట!

Chiranjeevi Next Movie Is Not A Remake

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్ర ‘భోళాశంకర్’ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా, తమిళ మూవీ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా, ఈ సినిమా పూర్తి కాకముందే, చిరు తన నెక్ట్స్ మూవీని ఓకే చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Chiranjeevi : ఆ ఇద్దరి యంగ్ డైరెక్టర్స్‌తో చిరంజీవి సినిమా.. నిజమేనా?

ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చిరుకి తమ కథలను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్‌కు చిరు ఓకే చెప్పినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. వారిలో యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా ఒకరు. అయితే, ఆయన చిరుతో చేయబోయే సినిమా ఓ మలయాళ చిత్ర రీమేక్ అని.. ‘బ్రో డాడీ’ అనే మలయాళ సినిమాను తెలుగులో చిరు రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

Chiranjeevi: ఆ డైరెక్టర్ నాగ్ తరువాత మెగాస్టార్‌ను ఒప్పించాడట.. నిజమేనా..?

ఇటీవల వరుస రీమేక్స్‌తో వస్తున్న చిరు, ప్రస్తుతం భోళాశంకర్ కూడా ఓ రీమేక్ మూవీ కావడంతో, తన నెక్ట్స్ మూవీని ఖచ్చితంగా తెలుగు స్క్రిప్టుతో రావాలని చూస్తున్నారు. దీంతో, తన నెక్ట్స్ సినిమాను రీమేక్ మూవీగా తెరకెక్కించేందుకు చిరు ఏమాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఈ వార్తతో కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే సినిమా ఖచ్చితంగా తెలుగు కంటెంట్‌తో రాబోతుందనే వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.